మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.
మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్‌లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్‌కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది.
(చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)
దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్‌లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?)
మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


