పిల్లలు నా మూవీ ఒక్కటి కూడా చూడలేదు: షాలిని | Actress Shalini Says Her Kids Still Not Watched Her Films | Sakshi
Sakshi News home page

Shalini: పిల్లలు ఇంతవరకు నా సినిమాలేవీ చూడలేదు

Feb 22 2026 1:19 PM | Updated on Feb 22 2026 1:41 PM

Actress Shalini Says Her Kids Still Not Watched Her Films

చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం మొదలుపెట్టింది షాలిని. బాలనటిగా 50కి పైగా సినిమాలు చేసింది. వాటిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలున్నాయి. తెలుగులో బెజవాడ బెబ్బులి, జైలు పక్షి, శారదాంబ, చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

బాలనటిగా, హీరోయిన్‌గా..
1997లో అనియతిప్రావు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. మలయాళంతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తమిళ స్టార్‌ హీరో అజిత్‌ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది. అయితే పిల్లలిద్దరూ ఇంతవరకు తన సినిమాలేవీ చూడలేదంటోంది షాలిని. 

ఒక్క సినిమా చూడలేదు
తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా పిల్లలు ఇంతవరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. ఎప్పుడైనా చూద్దామని ప్లాన్‌ చేసుకుంటారు. తీరా సమయం దగ్గరపడ్డాక తర్వాత చూద్దాం అని వాయిదా వస్తుంటారు. అయితే నేను యాక్ట్‌ చేసిన సాంగ్స్‌ మాత్రం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్క మూవీ కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పటికైనా ఒక్క సినిమా అయినా చూడండ్రా.. అని స్టేజీపైనే పిల్లలను అభ్యర్థించింది షాలిని.

 

 

చదవండి: కుర్రాడైనా ఓకే అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్న హీరోయిన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement