చిరంజీవితో సమానంగా అల్లు అర్జున్‌.. రికార్డ్‌ క్రియేట్‌ | Allu Arjun won 7 Filmfare Awards equal to Chiranjeevi record | Sakshi
Sakshi News home page

చిరంజీవితో సమానంగా అల్లు అర్జున్‌.. రికార్డ్‌ క్రియేట్‌

Feb 22 2026 12:03 PM | Updated on Feb 22 2026 12:13 PM

Allu Arjun won 7 Filmfare Awards equal to Chiranjeevi record

కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ వేడుకలో పుష్ప-2 చిత్రం సత్తా చాటింది. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ పరిశ్రమ నుందచి  2024 ఏడాదిలో విడుదలైన సినిమాలకు సంబంధించిన నటీనటులకు తాజాగా అవార్డులు అందజేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ సౌత్‌ ఉత్తమ నటుడిగా పుష్ప-2 చిత్రానికి గాను పురష్కారాన్ని అందుకున్నారు. ఆపై పుష్ప-2 ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డ్స్‌ కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

టాలీవుడ్‌ నుంచి అత్యధికంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ అందుకున్న నటుడిగా మెగాస్టార్‌ చిరంజీవి(7) ఉన్నారు. అయితే, తాజాగా చిరంజీవితో పాటు సమానంగా ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న హీరోగా బన్నీ నిలిచారు. కానీ, ఫిల్మ్‌ఫేర్‌ నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డులను చిరు కలిగి ఉండటం విశేషం.

అల్లు అర్జున్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 
1. పరుగు (2008)
2. వేదం (2010)
3. రేసుగుర్రం (2014)
4. పుష్ప: ది రైజ్ (2021)
5. పుష్ప 2: ది రూల్ (2024)
6. రుద్రమదేవి (గోన గన్నారెడ్డి పాత్రకు - 2015)
7. సరైనోడు (2016) ఉత్తమ నటుడు - క్రిటిక్స్ ఛాయిస్

చిరంజీవి అందుకున్న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ :

1. శుభలేఖ (1982)
2. విజేత (1985)
3. ఆపద్బాంధవుడు (1992)
4. ముఠా మేస్త్రి (1993)
5. స్నేహం కోసం (1999)
6. ఇంద్ర (2002)
7. శంకర్ దాదా MBBS (2004)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement