పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్‌దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
(చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌గా ఎలా మారాడు?)
ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది.
ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.
(చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)
బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్‌టైమ్‌నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


