అదే చివరి సినిమా అనుకున్నా.. రూ.1 కోటి పారితోషికం! | Arshad Warsi was Told to Charge Rs 1 crore After Munna Bhai Success | Sakshi
Sakshi News home page

Arshad Warsi: రూ.1 కోటి తీసుకోమని వార్నింగ్‌.. అదే చివరి మూవీ, నావల్ల కాదనుకున్నా!

Feb 21 2026 2:59 PM | Updated on Feb 21 2026 3:08 PM

Arshad Warsi was Told to Charge Rs 1 crore After Munna Bhai Success

కొన్ని సినిమాలు కెరీర్‌నే మలుపు తిప్పుతాయి. బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీకి మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ అలాంటి సినిమానే! హీరో సంజయ్‌ దత్‌కు రైట్‌ హ్యాండ్‌గా ఉంటూ తన కామెడీ టైమింగ్‌, డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తాడు. వీరి కాంబినేషన్‌ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది కన్నార్పకుండా చూస్తుంటారు. 

ఎంతిస్తే అంత చాలనుకున్నా..
ఈ మూవీ తన కెరీర్‌లోనే టర్నింగ్‌ పాయింట్‌ అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ. తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. మున్నా భాయ్‌ సినిమాకంటే ముందు నేను పెద్దగా సంపాదించిందంటూ ఏమీ లేదు. ఎంతిస్తే అంత చాలనుకుని సినిమాలు చేసుకుంటూ పోయాను తప్ప ఎన్నడూ మంచి పారితోషికం కోసం గొడవపడలేదు. మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌ రిలీజయ్యాక కరోజు దర్శకనిర్మాత విపుల్‌ షా నాకు ఫోన్‌ చేశాడు. 

మున్నా భాయ్‌ MBBS మూవీలో ఒక దృశ్యం

రెమ్యునరేషన్‌ రూ.1 కోటి
ఇక మీదట నువ్వు చేసే సినిమాలకు రూ.1 కోటి కంటే ఒక్క రూపాయి తక్కువ తీసుకున్నా నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ టాలెంట్‌ నీకు తెలియట్లేదు. ఎందుకిలా చేస్తున్నావు? అని క్లాస్‌ పీకాడు. అప్పుడు నా మేనేజర్‌తో ఎవరైనా అడిగితే నా రెమ్యునరేషన్‌ కోటి రూపాయలు అని చెప్పమన్నాను. అప్పటినుంచే నాకు కొంచెం ఎక్కువ డబ్బు రావడం మొదలైంది. నిజానికి మున్నాభాయ్‌ సినిమా ఆఫర్‌ నాకంటే ముందు చాలామందికి వెళ్లింది. నేను కూడా మంచి పొజిషన్‌లో ఉంటే రిజెక్ట్‌ చేసేవాడినేమో!

చివరి సినిమా అనుకున్నా..
ఇదే నా చివరి సినిమా అవుతుందనుకున్నాను. ఎందుకంటే మళ్లీ గూండాలా నటించమనే ఆఫర్లు వస్తాయి.. వాటిని చేయడం నావల్ల కాదని డిసైడయ్యాను. అనూహ్యంగా సినిమాకు మంచి స్పందన లభించింది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది అని అర్షద్‌ వార్సీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌కు రీమేక్‌గా తెలుగులో శంకర్‌దాదా MBBS తెరకెక్కగా ఇక్కడ కూడా ఘన విజయం అందుకుంది.

చదవండి: కూతురు పుట్టిన ఏడాదికి పాప ఫోటో షేర్‌ చేసిన అంబటి అర్జున్‌

Advertisement
 
Advertisement
Advertisement