రజనీకాంత్, కమల్‌హాసన్‌ మల్టీస్టారర్‌.. వీడియో విడుదల | Rajinikanth And Kamal Haasan Multistarrer Movie Glimpse | Sakshi
Sakshi News home page

రజనీకాంత్, కమల్‌హాసన్‌ మల్టీస్టారర్‌.. వీడియో విడుదల

Feb 21 2026 12:26 PM | Updated on Feb 21 2026 1:08 PM

Rajinikanth And Kamal Haasan Multistarrer Movie Glimpse

తమిళ స్టార్‌ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌ కలిసి సుమారు 46ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. దీంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెట్టుకున్నారు. జైలర్‌తో భారీ హిట్‌ కొట్టిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్  ఈ ఇద్దరిని కలిపి మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా ఒక స్పెషల్‌వీడియోను (గ్లింప్స్‌)ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  ‘అల్లావుద్దీనుమ్‌ అద్భుత విళక్కుమ్‌’ (1979) సినిమా తర్వాత రజనీ–కమల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ (కమల్‌హాసన్‌  బేనర్‌), రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూర్చనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement