బ్యాండ్‌ మేళం: తిప్పుకుంటాన్నవ్‌ పాట రిలీజ్‌ | Band Melam Movie: Thippukuntannav Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Band Melam Movie: రాము రాథోడ్‌ పాటకు కోర్ట్‌ జంట స్టెప్పులు

Feb 21 2026 12:47 PM | Updated on Feb 21 2026 1:03 PM

Band Melam Movie: Thippukuntannav Lyrical Song Out Now

కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌- శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం బ్యాండ్‌ మేళం. ఈసారి వీరు బావామరదళ్లుగా నటిస్తున్నారు. ఇటీవలే వాలంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా ఎమోషనల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో హీరో హీరోయిన్‌కు బ్రేకప్‌ అయినట్లు చూపించారు.

సాంగ్‌ రిలీజ్‌
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వదిలారు. 'బెల్లం చుట్టూ ఈగలెక్క.. మంచం చుట్టూ దోమ లెక్క.. గుడి సుట్టూ భక్తుని లెక్క.. బారు సుట్టూ  తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్‌' అంటూ ఈ పాట కొనసాగుతుంది. హుషారుగా సాగే ఈ సాంగ్‌లో శ్రీదేవి- రోషన్‌ ఎనర్జిటిక్‌ స్టెప్పులేశారు.

సినిమా
బిగ్‌బాస్‌ ఫేమ్‌ రాము రాథోడ్‌ ఈ పాట పాడటంతో పాటు రోషన్‌తో కలిసి డ్యాన్స్‌ చేశాడు. విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందించిన ఈ పాటకు వెంకటేశ్‌ కాపు కొరియోగ్రఫీ అందించాడు. చంద్రబోస్‌ లిరిక్స్‌ సమకూర్చాడు. రాము రాథోడ్‌, అదితి భావరాజు ఆలపించారు. సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ బ్యాండ్‌మేళం మూవీ మార్చి 13న విడుదల కానుంది.

 

చదవండి: ధురంధర్‌.. ఆ సీన్‌ అయిపోగానే ఏడ్చేశారు: ఆర్‌.మాధవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement