ఏడేళ్లు విడివిడిగా నిద్ర.. మా ఇద్దరికీ స్లీప్‌ డివోర్స్‌: నటి | Archana Puran Singh Says She and Husband Slept Separately for 7 Years | Sakshi
Sakshi News home page

నా భర్తతో ఒకే బెడ్‌పై నిద్రించలేదు.. నావల్ల కాదు!

Feb 20 2026 6:32 PM | Updated on Feb 20 2026 6:45 PM

Archana Puran Singh Says She and Husband Slept Separately for 7 Years

బాలీవుడ్‌ నటి అర్చన పూరణ్‌ సింగ్‌ అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవేవీ కాకుండా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తోంది. ఎటువంటి మొహమాటం లేకుండా పర్సనల్‌, ప్రొఫెషనల్‌.. అన్ని విషయాలను పంచుకుంటోంది. 

ఐ లవ్యూ చెప్పుకోవడం కాదు
తాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఐ లవ్యూ చెప్పుకోవడంలో కాదు, దాన్ని చూపించడంలో ఉంటుంది. అయితే పెరుగుతున్న వయసును బట్టి ఈ ప్రేమ రూపాలు కూడా మారుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు. కాబట్టి మరోసారి మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకునే వీలు దొరికింది. నాకు ఆలస్యంగా పడుకోవడం అలవాటు. తనేమో త్వరగా నిద్రపోతాడు. 

చిన్న పనులే..
అతడికి డిస్టర్బ్‌ అవకూడదని నేను ఎటువంటి శబ్ధాలు చేయను. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకునే పాటలు వింటాను. పొద్దున ఆయన త్వరగా లేస్తాడు. అప్పుడు నేనింకా నిద్రలోనే ఉంటాను కాబట్టి తను కూడా నన్ను డిస్టర్బ్‌ చేయడు. సైలెంట్‌గా తన పనులు తాను చేసుకుంటాడు. ఈ చిన్నచిన్న పనులే ప్రేమను సూచిస్తాయి.

ఈ లెక్కన విడాకులైనట్లే!
నా భర్తకు గురక అలవాటు ఉంది. నాకేమో చిన్న అలికిడి అయినా చటుక్కున లేస్తాను. మళ్లీ నిద్రలోకి జారుకోవడం చాలా కష్టం. అందుకే భర్త పక్కన నేను పడుకోలేను. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని స్లీప్‌ డివోర్స్‌ అంటారు. ఐదు నుంచి ఏడేళ్లపాటు మేమిద్దరం ఇలాగే విడివిడిగానే నిద్రపోయాం. ఈ లెక్కన విడాకులు తీసుకున్నట్లే! (నవ్వుతూ)

జీవితం చాలా చిన్నది
గత 10-15 ఏళ్లలో మా మధ్య ఇగో పూర్తిగా నశించిపోయింది. ముందు నువ్వే సారీ చెప్పాలన్న వాదన అనేదే మా మధ్య లేదు అని చెప్పుకొచ్చింది. అర్చన భర్త, నటుడు పర్మీత్‌ మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎన్ని పండుగలు, బర్త్‌డేలు ఉన్నాయని? ప్రతిదానికి గొడవపడుతూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది. అన్నింటినీ పక్కనపెట్టి సంతోషంగా బతికేయాలి అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అజిత్‌, విజయ్‌ మధ్య శతృత్వం? క్లారిటీ ఇచ్చిన షాలిని

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement