సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మృణాల్ ఠాకుర్.. అంతకు ముందు హిందీ సీరియల్స్‌తో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె గ్లామర్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అలాంటిది గత కొన్నిరోజుల నుంచి మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె బంధం గురించి తెగ రూమర్స్ వచ్చాయి. ఏకంగా పెళ్లి చేసుకుంటారని కూడా మాట్లాడుకున్నారు. అంతకు ముందు మృణాల్ చేసిన ఓ ప్రీమియర్‌లో ధనుష్ కనిపించడమే దీనికి కారణం. అయితే ఆ రోజు ధనుష్ ఎందుకు వచ్చాడనేది ఇప్పుడు మృణాల్ బయటపెట్టింది.
(ఇదీ చదవండి: లెస్బియన్ పాత్రలో రష్మిక?)
'నేను ధనుష్ సర్‌కి పెద్ద అభిమానిని. ఆయన చేసిన రాయన్, మారి, రాంఝానా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' అయితే ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ఆయన నటన అద్భుతం. మిగతా యాక్టర్స్ నుంచి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ రాబట్ట గల సత్తా కూడా ఆయన సొంతం. నటుడిగానే కాకుండా గీత రచయిత, సింగర్, డ్యాన్సర్, డైరెక్టర్ కూడా. 'తేరే ఇష్క్ మే' షూటింగ్ జరుగుతున్న టైంలో సర్.. మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కి వస్తారా? అని అడిగాను. ఆయన వస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగానే ఆయన రావడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్‌లో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను' అని ఓ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్స్ గురించి మాట్లాడిన మృణాల్.. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో కూడా నాకు తెలియదు. ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఇష్టమైతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని, కాకపోతే అంతలోపు తాను నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయని పేర్కొంది. ఈమె హీరోయిన్‌గా చేసిన హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.
(ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్ భాయ్‌ఫ్రెండ్ భయపడ్డాడు: మృణాల్)
Actress #MrunalThakur on #Dhanush!
"He is a genius! He is a multi-talented. I would like to work with him definitely. After watching his movie, I became a huge fan of his works."
pic.twitter.com/s7B65LPvil— Star Talkies (@startalkies_ofl) February 20, 2026


