19ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న 'షకీరా' | Shakira Musical concert in mumbai and delhi | Sakshi
Sakshi News home page

19ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న 'షకీరా'

Feb 20 2026 1:28 PM | Updated on Feb 20 2026 1:36 PM

Shakira Musical concert in mumbai and delhi

సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్‌ గాయని షకీరా భారత్‌కు రానుంది. సుమారు 19 సంవత్సరాల తర్వాత షకీరా మళ్లీ భారత్‌కి రానున్నడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. కొలంబియన్ సింగర్‌ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్‌లో తొలిసారి ముంబైలో(2007)  ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి  ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది.

ఏప్రిల్ 10న ముంబై మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో షకీరా సంగీత కచేరి ఉండనుంది. ఆపై ఏప్రిల్‌ 15న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరిగే కార్యక్రమంలో షకీరా పాల్గొననుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్‌ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌  ప్రారంభ సమయంలో  తప్పకుండా గుర్తొచ్చేది థీమ్‌ సాంగ్‌  'వాక్కా వాక్కా దిస్‌ టైమ్‌ ఫర్‌ ఆఫ్రికా'.. 2010లో ఈ సాంగ్‌ను షకీరా పాడింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ ఈ సాంగ్‌ వినపడుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement