అమ్మ ఉగ్రరూపం.. పీక పట్టుకుని చెంప పగలగొట్టింది! | Priyanka Chopra recalls mom Madhu held a cab driver Neck in Delhi | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: అమ్మ అతడి పీక పట్టుకుంది, తననెప్పుడూ అలా చూడలేదు!

Feb 20 2026 1:10 PM | Updated on Feb 20 2026 1:28 PM

Priyanka Chopra recalls mom Madhu held a cab driver Neck in Delhi

గ్లోబల్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా "ద బ్లఫ్‌" సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నేటి (ఫిబ్రవరి 20) నుంచే అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రియాంక తన తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

పక్కదారి పట్టడంతో..
ప్రియాంక మాట్లాడుతూ.. అప్పుడు నాకు 11 ఏళ్లు ఉంటాయనుకుంటాను. ఒకసారి ఢిల్లీలో ఉండగా రాత్రిపూట అమ్మ, నేను బయటకు వెళ్లాం. క్యాబ్‌ బుక్‌ చేసుకుని కొంత దూరం వెళ్లగానే సడన్‌గా అమ్మ ముఖం ఎర్రబడింది. డ్రైవర్‌ పీక పట్టుకుని తిట్టడం మొదలుపెట్టింది. అతడు నెమ్మదిగా కారును మెయిన్‌ రోడ్‌ నుంచి మరోవైపు దారి తిప్పాడు. అది షార్ట్‌కట్‌ అని చెప్పాడు. 

4 నెలలు కిక్కుమనకుండా..
కారులో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. అమ్మ అతడి కాలర్‌ పట్టుకుని మెయిన్‌రోడ్‌ మీదుగానే కారును తీసుకెళ్లమని హెచ్చరించింది. అతడి చెంప కూడా పగలగొట్టింది. అమ్మను అలా ఉగ్రరూపంలో ఎన్నడూ చూడలేదు. ఆ సంఘటన తర్వాత దాదాపు నాలుగు నెలలవరకు ఎన్నడూ అమ్మతో గొడవపడలేదు. ఆరోజు నేను లేకపోయుంటే అమ్మ అంత సీరియస్‌ అయ్యేదో? లేదో? కానీ, హోటల్‌కు తిరిగి రాగానే అమ్మ నిలువెల్లా వణికిపోయింది అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

చదవండి: మలయాళ మూవీ చథా పచ్చ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement