ప్రశాంత్ వర్మ- ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?.. అసలు నిజమేంటి? | Prabhas And Prashanth Varma Movie Not Cancelled, Director Gives Clarity Amid Rumors, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Prasanth Varma: ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ రద్దు.. ప్రశాంత్ వర్మ ఏమన్నారంటే?

Feb 20 2026 5:01 PM | Updated on Feb 20 2026 5:28 PM

Prasanth Varma and Prabhas Project Shelved is true Details Here

యంగ్ రెబల్ స్టార్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. తన చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవీ కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి రెబల్ స్టార్ ఓకే చెప్పిన సంగతి తెలిసింది.

ఇన్నీ భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రభాస్ చేతిలో ఉండగా.. ప్రశంతా వర్మతో సినిమా చేసేందుకు టైమ్‌ కేటాయిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ రద్దైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సిన మూవీ ఆగిపోయిందని టాక్ వినిపించింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌ గురించి తెగ ఆరా తీస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా అని షాకవుతున్నారు.

ప్రశాంత్ వర్మ క్లారిటీ..

ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందన్న వార్తలపై డైరెక్టర్ స్వయంగా స్పందించారు.  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటివీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తాయని అన్నారు. ప్రభాస్‌తో ప్రాజెక్ట్ రద్దు కాలేదని.. ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్లే ఆలస్యం కానుందని తెలిపారు. స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతే తప్ప తమ ప్రాజెక్ట్‌ రద్దు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. 

కాగా.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్‌, కల్కి-2 సినిమాలు చేయనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత, అతను ప్రశాంత్ వర్మతో కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. ఇక రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ చిల్ అవుతూ అప్‌డేట్స్ కోసం వేచి చూడటమే. 

జై హనుమాన్‌తో బిజీగా ప్రశాంత్ వర్మ

మరోవైపు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో జై హనుమాన్‌ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని సమాచారం. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement