అజిత్‌, విజయ్‌ మధ్య శత్రుత్వం? ఎలా ఉంటారో చెప్పిన షాలిని | Shalini: Vijay and Ajith Kumar Happy for Each Other Success | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ స్టార్స్‌ మధ్య వైరం? అజిత్‌ భార్య ఏమందంటే?

Feb 20 2026 5:12 PM | Updated on Feb 20 2026 5:18 PM

Shalini: Vijay and Ajith Kumar Happy for Each Other Success

కోలీవుడ్‌ స్టార్స్‌ అజిత్‌, విజయ్‌ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్‌ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.

షాలిని ఆసక్తికర వ్యాఖ్యలు
హీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్‌ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో షాలిని మాట్లాడుతూ.. అజిత్‌, విజయ్‌.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్‌ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. 

అప్పుడు కూడా వివాదం
ఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్‌ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. అప్పుడు విజయ్‌ అజిత్‌కు కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్‌ స్పందిస్తూ.. . అజిత్‌ సర్‌కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్‌ ఒకరు. 

సినిమా
ఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్‌ సర్‌కు విజయ్‌ విషెస్‌ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్‌ చివరగా నటించిన సినిమా జన నాయగణ్‌. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్‌ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్‌.. ప్రస్తుతం కార్‌ రేసింగ్‌ పోటీల్లో బిజీగా ఉన్నాడు.

చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్‌పై వివాదం

Advertisement
 
Advertisement
Advertisement