బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన చిత్రం ధురంధర్. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న విడుదలవగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా ఆర్. మాధవన్ బయటపెట్టాడు.
దుఃఖం ఆపుకోలేకపోయారు
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద ముఠాని పెంచి పోషించే రెహమాన్ బలోచ్ పాత్రలో అక్షయ్ ఖన్నా, పాకిస్తాన్ మేజర్‌గా అర్జున్ రాంపాల్ నటించారు. సినిమాలో 26/11 ముంబై దాడుల సన్నివేశాన్ని చిత్రీకరించగానే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ ఒక్కసారిగా ఏడ్చేశారు. షూటింగ్ అయ్యేవరకు బాధను గొంతులోనే దిగమింగుకున్నారు. దర్శకుడు కట్ చెప్పిన మరుక్షణం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అలాంటి పాత్రలు పోషించినప్పుడు వాటి ప్రభావం వారిపై కొన్నిరోజులపాటు ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ధురంధర్ విషయానికి వస్తే ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ధురంధర్ 2 మార్చి 19న విడుదల కానుంది.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ


