ఓటీటీలో డార్క్‌ థ్రిల్లర్‌ మూవీ.. 20రోజుల్లోనే స్ట్రీమింగ్‌ | Naveen Chandra And Divya Pillai Starrer Honey Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో డార్క్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ.. 20రోజుల్లోనే స్ట్రీమింగ్‌

Feb 21 2026 10:25 AM | Updated on Feb 21 2026 11:41 AM

Honey Movie OTT Streaming Details

పలాసా, శ్రీదేవి సోడా సెంటర్‌, మట్కా తర్వాత కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ  ‘హనీ’. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇందులో  దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద కీలక పాత్రలలో కనిపించారు.

హనీ చిత్రం సన్‌నెక్ట్స్‌ (SUN NXT)లో ఫిబ్రవరి 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తాజాగా పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కూడా ఈ మూవీ విడుదల కానుందని సమాచారం. క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తో పాటు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. కథా నేపథ్యం బాగున్నప్పటికీ ద్వితీయార్ధం పెద్దగా మెప్పించలేదనే విమర్శలు వచ్చాయి. ఆనంద్‌ పాత్రలో నవీన్‌ చంద్ర నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కాయి.

కథేంటంటే..
ఆనంద్‌(నవీన్‌ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్‌ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్‌ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement