'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నటి | Divya Agarwal Shuts Down Separation Rumours With Apurva Padgaonkar | Sakshi
Sakshi News home page

Divya Agarwal: అలాంటి భయమే లేదు, అందుకే పెళ్లి చేసుకున్నా!

Feb 20 2026 7:32 PM | Updated on Feb 20 2026 7:37 PM

Divya Agarwal Shuts Down Separation Rumours With Apurva Padgaonkar

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 ఓటీటీ విన్నర్‌ దివ్య అగర్వాల్‌, భర్త అపూర్వ పడ్‌గోయంకర్‌ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

హ్యాపీ యానివర్సరీ మై లవ్‌
నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్‌.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.

అసలేమైంది?
దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్‌ భవ్య సింగ్‌.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్‌ రాగా వాటిని నటి టీమ్‌ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement