అర్జున్ సర్జా కూతురి మొదటి సినిమా.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Arjun Sarja's Seetha Payanam Movie Collections In Four Days | Sakshi
Sakshi News home page

Seetha Payanam Movie: బాక్సాఫీస్ వద్ద సీతా పయనం.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Feb 20 2026 7:02 PM | Updated on Feb 20 2026 7:11 PM

Arjun Sarja's Seetha Payanam Movie Collections In Four Days

అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సీతా పయనం. ఈ చిత్రంలో నిరంజన్, ఐశ్వర్య ‍అర్జున్ జంటగా నటించారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.8.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. కేవలం మౌత్ టాక్‌తో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగడం విశేషం. త వారం విడుదలైన చిత్రాల పరంగా చూస్తే సీతా పయనం టాప్‌లో కొనసాగుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ మూవీలో అర్జున్, ధృవ్ సర్జాలు సైతం స్పెషల్ కేమియో రోల్స్‌లో మెప్పించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. 

s
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement