టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్.. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్ సినిమా ట్రైలర్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. దీంతో మూవీకి బజ్ వచ్చింది.
'జిగ్రీస్' సినిమా సన్నెక్ట్స్(Sun Nxt)లో జనవరి 6నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్లో పెద్దగా మెప్పించని ఈ మూవీలో చాలామంది కొత్తవారు నటించడంతో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడంతో ప్రేక్షకులకు రీచ్ అయింది.

కథేంటి..
జిగ్రీస్ అనే టైటిల్‌కు తగ్గట్లుగా కార్తిక్ (కృష్ణ బూరుగుల ) ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మని వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఉండగా మారుతీ 800 కారులో గోవా వెళ్లాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మద్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది.
ఈ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా..? రాత్రికిరాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాలి అనుకుంటారు..? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు.. అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితాలలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే.


