బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత హీరోయిన్ సమంత ఫుల్‌గా చిల్ అవుతోంది. గతేడాది క్రిస్‌మస్ వేడుకలు చేసుకున్న సామ్.. ఇటీవల భర్తతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
అయితే తాజాగా సమంత క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సామ్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడనేది మాత్రం సామ్ రివీల్ చేయలేదు.
కాగా.. సామ్ - తమన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటించిన అల్లుడు శీనులో తమన్నా స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. మరోవైపు సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మా ఇంటి బంగారంలో నటిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్‌లో కేవలం స్పెషల్ సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది.


