నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్ వీడియోలు చేసే అన్వేష్.. తెలుగు రాష్ట్రాల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇతడు అప్పుడప్పుడు అసభ్యకర భాష ఉపయోగిస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే హిందూ దేవుళ్లని కించపరిచేలా మాట్లాడి వివాదంలోనూ చిక్కుకున్నాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్‌గానే ఇతడి ఇన్ స్టా ఖాతా.. ఒకటి రెండు రోజులు కనిపించలేదు. ఇప్పుడు ఈ కేసులో కాస్త పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇన్ స్టాతో పాటు యూట్యూబ్‌కి కూడా అన్వేష్ అకౌంట్ గురించి పంజాగుట్ట పోలీసులు లేఖ రాయనున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: 'కోర్ట్' సినిమా టైంలోనే చదువు ఆపేశాను)
యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగట్టు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతేడాది పంజాగుట్టలో ఇతడిపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొంది. దీంతో అన్వేష్‌పై పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈమేరకు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్.. విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా హిందూ దేవుళ్ల గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు.
(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)


