తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! ‍ | Hotspot 2 Movie Trailer OUT | Sakshi
Sakshi News home page

Hotspot 2 Trailer: బోల్డ్ సినిమాకు సీక్వెల్.. ఫన్నీగా ట్రైలర్

Jan 6 2026 7:21 PM | Updated on Jan 6 2026 7:52 PM

Hotspot 2 Movie Trailer OUT

కమర్షియల్, థ్రిల్లర్, హారర్ సినిమాలు.. దాదాపు ఒక ఫార్మాట్‌కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ఒకరో ఇద్దరో దర్శకులు మూవీస్ తీస్తుంటారు. వీటికి ఎంత ఆదరణ దక్కుతుందనేది పక్కనబెడితే డిఫరెంట్ అటెంప్ట్ అనిపించుకుంటూ ఉంటాయి. అలా 2024లో తమిళంలో 'హాట్ స్పాట్' అనే బోల్డ్ మూవీ రిలీజైంది. తర్వాత దాని తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

రెండేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్‌లో పెళ్లి తర్వాత ఆడపిల్లలే ఎందుకు మరో ఇంటికి వెళ్లాలి? ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి, పిల్లల్ని టీవీ షోలు ఎలా చెడగొడుతున్నాయి అనే స్టోరీలు చూపించారు. నాలుగు కథల ఆంథాలజీ టైపులో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కాస్త డోస్ పెంచి మరో నాలుగు కథలతో మూవీ తీసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో డింక్ (DINK-డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్) కల్చర్... సినిమా హీరోల ఫ్యాన్స్ చేసే అతి తదితర స్టోరీల ఉండనున్నాయని ట్రైలర్‌లో చూపించారు. ఇదే ట్రైలర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి శివకార్తికేయన్, ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి లాంటి డైలాగ్స్ ఫన్నీగా అనిపించాయి. ఈ నాయకులిద్దరూ కలిసి విజయ్ కాంత్ విగ్రహావిష్కరణ చేస్తారని ఓ పాత్ర అనడం ఆసక్తికరంగా అనిపించింది. ధోనీ రిటైర్మెంట్, 2026 ఎన్నికల్లో దళపతి గెలుస్తాడా లేదా? లాంటి విచిత్రమైన నిజ-కల్పిత సంఘటనలతో ఈసారి సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ భవానీ శంకర్ కీలక పాత్ర చేసింది. మిగతా వాళ్లెవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు.

(ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)

Advertisement
 
Advertisement
Advertisement