బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ త్వరలోనే రెండోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా ఈ నటి తన బేబీ బంప్ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. నల్లటి బనారస్ చీరలో బేబీ బంప్‌తో ఉన్న నటి ఫోటోలను చూసిన అభిమానులు బేబీ ఆన్ ద వే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వ్యాపారవేత్తతో పెళ్లి
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో 'సావరియా' మూవీతో సోనమ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.
సినిమాలు
బాంబే టాకీస్, బ్లైండ్, ప్రేమ రతన్ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సోనమ్ (Sonam Kapoor) బ్యాటిల్ ఫర్ బిట్టోరా సినిమా చేస్తోంది. ఇది అనూజా చౌహాన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇది ప్రకటించి రెండేళ్లవుతున్నా మళ్లీ దానిపై ఎటువంటి అప్‌డేట్ లేదు.


