టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. హీరో సుశాంత్‌తో కొంత కాలంగా ఆమె ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఇదే అంశంపై కొద్దిరోజుల క్రితం మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్.. నేను పెళ్లి చేసుకోవడం లేదని గట్టిగానే చెప్పారు. అయినప్పటికీ సోషల్‌మీడియాలోని కొన్ని మీమ్ పేజీలు మాత్రం వైరల్ చేస్తూనే ఉన్నాయి. రెండురోజులుగా మళ్లీ ఇదే తంతు నెట్టింట కనిపిస్తుంది. వచ్చే ఏడాదిలో మీనాక్షి, సుశాంత్‌ల పెళ్లి అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇదే విషయంపై మీనాక్షీ టీమ్ రియాక్ట్ అయింది.
కొద్దిరోజుల క్రితం మీనాక్షి చౌదరి, సుశాంత్ ఇద్దరూ ఒక ఎయిర్ పోర్టులో కలిసి కనిపించారు. ఇంకేముంది పెళ్లి వార్తలు లింకు చేశారు. దీంతో మరోసారి ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ఆమె టీమ్ స్పందించింది. వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మీనాక్షికి సంబంధించి ఏదైనా విషయం ఉంటే తాము తప్పకుండా అందరికీ తెలుపుతామన్నారు. ఇకనైన ఈ రూమర్స్ కి పుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నట్లు వారు అభ్యర్థించారు. హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి కలిసి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాలో నటించారు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.


