బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 7న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఆడించడంలోనే ఈ దంపతులిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాబు పుట్టాక తొలిసారి ఓ ఖరీదైన వస్తువు కొన్నారు.
లగ్జరీ కారు
లెక్సస్ బ్రాండ్‌కు LM350h 4S మోడల్ కారును తమ సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.3.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ ఈ కారును నడుపుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారులో ప్రీమియం సౌండ్‌తో పాటు 48 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. సీటింగ్ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
అదో కొత్త ఫీలింగ్
ఇకపోతే ఈ ఏడాది తనకు ఎక్కువ సంతోషాన్నిచ్చిన క్షణం.. తాను తండ్రవడమేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విక్కీ కౌశల్. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఒక మ్యాజికల్ మూమెంట్ అని పేర్కొన్నాడు. ఈ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతానని తనకు తెలుసని.. బాబును చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనసుకెంతో ప్రశాంతంగా అనిపించిందన్నాడు. అలాంటి అనుభూతి అంతకుముందెన్నడూ కలగలేదని గుర్తు చేసుకున్నాడు. కాగా విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు.


