ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్య ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడింది. తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని తెలిపింది. అవకాశాల కోసం తానెప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని దివ్య ఖోస్లా పేర్కొంది. ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
దివ్య ఖోస్లా మాట్లాడుతూ..'బాలీవుడ్‌లో చాలా మొసళ్లు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నువ్వు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. పని కోసం నా ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడూ అమ్ముకోను. యూకేలో ఓ సినిమా కోసం సున్నా డిగ్రీల టెంపరేచర్‌లో దాదాపు 42 రోజుల పని చేశా. అది నా కెరీర్‌లో అత్యంత అద్భుతమైన షూట్. దాదాపు మైనస్ 10 డిగ్రీలు.. అయినా కూడా నాన్-స్టాప్‌గా చిత్రీకరించాం. ఇతర సినిమాలతో పోల్చడానికి నాకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది.' అని తెలిపింది.
అంతేకాకుండా భూషణ్‌కుమార్‌తో విడాకులపై కూడా దివ్య ఖోస్లా స్పందించింది. మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ మీడియా అది నిజం కావాలని కోరుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా.. ఆమె 2005లో టీ-సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే దివ్య ఖోస్లా చివరిసారిగా నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి నటించిన థ్రిల్లర్-కామెడీ ఏక్ చతుర్ నార్‌లో కనిపించింది.


