పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఖుదీరామ్ బోస్ జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శం. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఖుదీరామ్ బోస్. ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా.. విజయ్ నిర్మించారు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ప్రదర్శించారు.
తాజాగా ఈ చిత్రంలో ఓటీటీకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేవ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. డిసెంబర్ 3, 1889న జన్మించిన ఖుదీరామ్ బోస్ కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలర్పించాడు. ఇటీవలే అతని జయంతి సందర్భంగా యావత్ దేశం నివాళులర్పించింది కాగా.. ఈ సినిమాలో రాకేశ్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు.
Khudiram Bose is streaming on the Central Government’s Waves OTT. Wishing the team all the very best. pic.twitter.com/t6CAzvhPto
— Rajinikanth (@rajinikanth) December 5, 2025


