సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్ | Samantha Skip Honeymoon After Wedding Raj Nidimoru | Sakshi
Sakshi News home page

Samantha: పెళ్లయిన నాలుగు రోజులకే ఇలా.. ఫొటో వైరల్

Dec 5 2025 5:04 PM | Updated on Dec 5 2025 5:36 PM

Samantha Skip Honeymoon After Wedding Raj Nidimoru

హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్‌గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.

(ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)

మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్‌లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.

'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement