ఇప్పుడంటే వెబ్ సిరీస్‌ల హవా కాస్త తగ్గింది గానీ లాక్ డౌన్‌కి ముందు, లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో చాలా సిరీస్‌లు అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. అలాంటి వాటిలో 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్'. నలుగురు మోడ్రన్ అమ్మాయిలు, వాళ్ల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన బోల్డ్ కామెడీ సిరీస్ ఇది. ఇప్పుడు దీని చివరి సీజన్ గురించి అప్‌డేట్ వచ్చేసింది.
(ఇదీ చదవండి: విమానాలు రద్దు.. 'లక్షలు' ఖర్చు చేసిన సెలబ్రిటీలు)
సయానీ గుప్తా, కృతి కల్హరీ, బని, మాన్వి గాగ్రూ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ తొలి సీజన్ 2019లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. రెండో సీజన్ 2020లో, మూడో సీజన్ 2022లో వచ్చాయి. కానీ చివరిదైన నాలుగో సీజన్ రావడానికి మాత్రం దాదాపు మూడేళ్ల పట్టేసింది. తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ డిసెంబరు 19 నుంచి చివరి సీజన్ స్ట్రీమింగ్ కానుందని పోస్ట్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు.
ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో రిలీజైన వాటి విషయానికొస్తే.. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'జటాధర', 'ద గర్ల్‌ఫ్రెండ్', 'డీయస్ ఈరే', 'స్టీఫెన్', 'థామా' తదితర సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్..: దర్శకుడు)
you’re invited to the OG gang’s meet up 🥰🥂#FourMoreShotsPleaseOnPrime, Final Season, Dec 19#SayaniGupta #KirtiKulhari @bani_j @maanvigagroo @RangitaNandy @ArunimaSharma84 #NehaPartiMatiyani #DevikaBhagat @misschamko @prateikbabbar #RajeevSiddhartha @milindrunning… pic.twitter.com/6M4NZVu3pT
— prime video IN (@PrimeVideoIN) December 5, 2025


