వారికి పుట్టగతులు ఉండవు: ఇం‍ద్రజ శాపనార్థాలు | Actress Indraja About Current Trend of Love Failures | Sakshi
Sakshi News home page

Actress Indraja: సుధీర్‌ నాకు దేవుడిచ్చిన వరం.. వారు సర్వనాశనం అయిపోతారు!

Dec 5 2025 1:31 PM | Updated on Dec 5 2025 1:37 PM

Actress Indraja About Current Trend of Love Failures

జంతర్‌ మంతర్‌, యమలీల, సొగసు చూడరతరమా, అమ్మ దొంగ, శుభమస్తు, పెద్దన్నయ్య, అల్లుడు అదుర్స్‌, మాచర్ల నియోజకవర్గం, ఉగ్రం, డాక్టర్‌.. ఇలా తెలుగులో అనేక సినిమాలు చేసింది ఇంద్రజ. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ హీరోయిన్‌గా, తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించింది. జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

సుధీర్‌ నాకు దేవుడిచ్చిన బంధం
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సమాజం పోకడల గురించి మాట్లాడింది. అలాగే సుడిగాలి సుధీర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ మూవీలో సుధీర్‌కు అమ్మగా నటించా.. అమ్మ అన్న మాటకు ఫిక్సయిపోయి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇది దేవుడిచ్చిన బంధం. సుధీర్‌ చేరుకోవాల్సిన స్థాయికి ఇంకా ఎందుకు చేరుకోలేదన్న చిన్న బాధ ఉంది.

పుట్టగతులు ఉండవ్‌
ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో ప్రేమలో మోసపోయినప్పుడు కూడా అంతే నొప్పి ఉంటుంది. అలా మోసం చేసినవాళ్లు ఆడవారైనా, మగవారైనా వారికి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు. మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి అని గుర్తుంచుకోండి.

అమ్మ కోరిక నెరవేర్చలేకపోయా..
మాకు దగ్గర్లో వడపళని మురుగన్‌ గుడి ఉండేది. అమ్మ ఆ గుడికి తీసుకెళ్లమని కోరింది. రెండు రోజుల్లో తీసుకెళ్తాను అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. ఇంతలో వారం రోజులకే అమ్మ చనిపోయింది. అమ్మ కోరిక నెరవేర్చలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. అమ్మను టైట్‌గా హగ్‌ చేసుకోవాలని ఉండేది, కానీ తను లేదు అంటూ ఇంద్రజ (Indraja) ఎమోషనలైంది.

చదవండి: హనీమూన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement