బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. శుక్రవారం ఎపిసోడ్‌లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది తేలిపోతుంది. అయితే, ఈ ముగ్గురికి కట్టు! నిలబెట్టు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. బ్రిక్స్‌తో వారు ఒక టవర్‌ను పేర్చి.. పడిపోకుండా దానిని కాపాడుకోవాలి. ఇదే సమయంలో బాల్స్‌తో ఇతర కంటెస్టెంట్స్ దాడి చేస్తుంటారు. సీజన్-7లో అమరదీప్ ఇదే టాస్క్‌తో బాగా వైరల్ అయ్యాడు. హౌస్‌మేట్స్ అందరూ అమర్‌ని టార్గెట్ చేయడంతో రేయ్ వద్దురా ప్లీజ్ అంటూ వేడుకుంటాడు. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అదే జరిగింది. కానీ, ఇక్కడ తనూజ, సుమన్ మాత్రమే రీతూ టవర్‌ను టార్గెట్ చేశారు.
'కట్టు నిలబెట్టు' టాస్క్‌కు సంచాలక్‌గా సంజనా ఉంటుంది. రీతూ కోసం డీమాన్ పవన్ ఒక్కడే నిలబడ్డాడు. అయితే, తను సైడ్ నుంచి కల్యాణ్ టవర్‌ను కూల్చేందుకు బాల్స్ విసురుతూ ఉంటాడు. దీంతో తనూజ ఫైర్ అవుతుంది. కల్యాణ్‌ను ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్లని తాను టార్గెట్ చేస్తానంటూ రీతూ టవర్‌పై బాల్స్ విసురుతుంది. దీంతో రీతూ కూడా తనూజపై భగ్గుమంటుంది. తొక్క, తోటకూర అంటూ తనూజపై రీతూ విరుచుకుపడుతుంది. అయితే, డీమాన్ దూకుడుగా బాల్స్ విసురుతున్న క్రమంలో లైన్ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్ అవుతాడు. ఇంకేముంది రీతూ టవర్‌ను సులభంగా కూల్చేశారు.


