నామినేషన్స్‌లో కూడా నవ్వుతూ ఉన్న భరణి.. టాస్కుల్లో మాత్రం ఫైర్ చూపించాడు. ఇప్పుడేకంగా కయ్యానికి కాలు దువ్వాడు. నిన్నటి టాస్క్ కాస్త గందరగోళంగా నడిచిన సంగతి తెలిసిందే కదా! దానికి కొనసాగింపుగా తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో భరణి.. సరిగా త్రిభుజాకారం లేని వస్తువుని ట్రయాంగిల్ అని ఎలా అంటారు? అని మండిపడ్డాడు. ఇప్పటికే కల్యాణ్, ఇమ్మూ కలిసి గ్రూప్‌గేమ్ ఆడుతున్నారని పసిగట్టిన భరణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు.
భరణి ఫ్రస్టేషన్
సంజనా సంచాలకురాలిగా తప్పు చేసిందని వాదించాడు. మరోవైపు రీతూ.. ఎవరైనా ఒకరు గెలిస్తే దాన్ని రచ్చ చేయాలి, చెండాలం చేయాలి. ఒకరు హ్యాపీగా ఉండకూడదు! అని అసహనం వ్యక్తం చేసింది. సీజన్‌లో ఎక్కడెక్కడ చీటింగ్ జరిగాయి? ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపట్టారు.. మొత్తం వీడియోలతో సహా బయటకు వచ్చాయి. అయినా సరే, ఇప్పటికీ నోరు మూసుకునే కూర్చున్నా అంటూ తన ఫ్రస్టేషన్ అంతా వెళ్లగక్కాడు.
చీటింగ్‌తో కల్యాణ్ కెప్టెన్
ఇంతకీ ఆ షూ గొడవేంటంటే.. కళ్లకు గంతలు కట్టి లైట్లు ఆఫ్ చేసే కెప్టెన్సీ టాస్క్‌లో కల్యాణ్ (Pawan Kalyan Padala) లైట్ ఆఫ్ చేసిందని భరణి అని పవన్.. అతడివైపు షూ చూపిస్తూ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆ వారం కల్యాణ్ కెప్టెన్ అయ్యాడు. దాన్నే తర్వాత తనూజకు కన్ఫెషన్ రూమ్‌లో వీడియో వేసి మరీ చూపించారు. భరణి బయటకు వెళ్లొచ్చాక ఆ ఎపిసోడ్ చూశాడు కాబట్టి తనకూ తెలిసిపోయింది.
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్
మరి కల్యాణ్‌కి ఎలా తెలిసిందంటే.. శ్రీజ రీఎంట్రీ ఇచ్చి కల్యాణ్‌కు కావాల్సినన్ని ఇన్‌పుట్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ తతంగాన్ని బయటపెట్టింది. కానీ ఇదే విషయాన్ని డిమాన్ పవన్‌తో మాత్రం చర్చించలేదు. అందుకే ప్రోమోలో కూడా వీళ్లు దేని గురించి అంటున్నారో తెలియక పవన్ సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. భరణి, కల్యాణ్ మాత్రం కొట్టుకునేంతలా పైపైకి వెళ్లారు. ఈ గొడవను పక్కనపెడితే ఈ సీజన్‌లో కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది.


