టికెట్ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్ బ్యాంక్ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో టికెట్ టు ఫినాలే.. సుమన్, భరణి, సంజనా, రీతూ, పవన్.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్ ఉంది.
టికెట్ టు ఫినాలే
వీళ్లు టికెట్ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయి మరీ ఫైనల్‌లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది.
ముగ్గురి మధ్యే పోటీ
అలాగే భరణి కూడా ఔట్ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్‌మేట్స్ (సంజన, భరణి, సుమన్, పవన్)కి టాప్ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి!


