ఓటీటీలో 'మిషన్‌ ఇంపాజిబుల్‌'.. ఉచితంగానే స్ట్రీమింగ్‌ | Impossible The Final Reckoning Movie free streaming Now OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'మిషన్‌ ఇంపాజిబుల్‌'.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

Dec 4 2025 12:21 PM | Updated on Dec 4 2025 12:43 PM

Impossible The Final Reckoning Movie free streaming Now OTT

హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ మూవీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ (Mission Impossible) ఉచితంగానే చూసేయండి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఇప్పటి వరకు రెంటల్‌ విధానంలో ఈ మూవీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా దానిని తొలగించారు. హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల్లో మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్‌ క్రూజ్‌ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్‌ మీడియా కూడా కథనాలు రాసింది. అతని నటన, యాక్షన్‌ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


ఆగష్టు 19న అమెజాన్‌ ప్రైమ్‌లో మిషన్‌ ఇంపాజిబుల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఇప్పటి వరకు రెంటల్‌ విధానంలో అందుబాటులో ఉంది. తాజాగా దానిని తొలగించేశారు. ఉచితంగానే ఈ మూవీని చూసేయవచ్చు. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 6వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్‌ రాబట్టింది. సుమారు రూ. 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు. క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

సిరీస్‌ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్‌ ఇంపాజిబుల్‌. సిరీస్‌ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్‌ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్‌ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్‌ ఫీస్ట్‌ అనే చెప్పాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement