రేణూ దేశాయ్‌కు పుట్టుకతోనే ఆ సమస్య! | Renu Desai Turns 44: She Have an Health Issue from Birth | Sakshi
Sakshi News home page

Renu Desai: 18 ఏళ్లకే హీరోయిన్‌.. ఆ సమస్య వల్ల పరిగెత్తలేదు!

Dec 4 2025 10:02 AM | Updated on Dec 4 2025 10:12 AM

Renu Desai Turns 44: She Have an Health Issue from Birth

తన ఆశలు వేరు, ఆశయం వేరనుకుంది నటి రేణూ దేశాయ్‌. చిన్నప్పుడు ఆమెకు అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలని కోరికగా ఉండేదట. ఒకవేళ అది కుదరకపోతే డాక్టర్‌ అవాలని కలలు కంది. కానీ, రెండూ జరగకపోయేసరికి ఊహించనివిధంగా హీరోయిన్‌గా మారింది. నేడు (డిసెంబర్‌ 4) రేణూ దేశాయ్‌ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

18 ఏళ్లకే హీరోయిన్‌గా..
రేణూ దేశాయ్‌.. పవన్‌ కల్యాణ్‌ బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 18 ఏళ్లు. అదే ఏడాది తమిళంలో జేమ్స్‌ పండు మూవీ చేసింది. తర్వాత మరోసారి పవన్‌తో జానీ సినిమా చేసింది. రెండే రెండు సినిమాలకే పవన్‌తో ప్రేమలో పడింది. తొలిచూపులోనే ప్రేమలో పడినా ఫస్ట్‌ ప్రపోజ్‌ చేసింది మాత్రం పవనే అని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై
అంతేకాదు తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నామని, కాకపోతే అది అధికారికంగా కాదని, ఇంట్లో సింపుల్‌గా వివాహం చేసుకున్నామని పేర్కొంది. అలా పవన్‌తో పెళ్లవగానే యాక్టింగ్‌ పక్కనపెట్టేసింది. ఖుషి, జానీ, గుడుంబా శంకర్‌, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది. నిర్మాతగానూ రెండు సినిమాలు చేసింది.

రెండు దశాబ్దాల తర్వాత  రీఎంట్రీ
పవన్‌- రేణూ (Renu Desai) జంటకు కొడుకు అకీరా, కూతురు ఆద్య సంతానం. 11 ఏళ్లపాటు కలిసున్న వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రేణూ ఎంతోకాలం డిప్రెషన్‌కు గురైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. అయితే రేణూ దేశాయ్‌కు ఓ అనారోగ్య సమస్య ఉంది. తనకు పుట్టుకతోనే గుండె సమస్య ఉంది.

పుట్టుకతోనే సమస్య
ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నాకు హార్ట్‌ రేట్‌ ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్‌గా మెడిసిన్‌ తీసుకోవాల్సిందే.. రన్నింగ్‌, మెట్లు ఎక్కడం వంటివి నేను చేయకూడదు. మా నానమ్మ 1974లో.. నాన్న పెళ్లికి ముందే చనిపోయారు. నాన్న కూడా చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించారు. నాకు మరీ అంత సీరియస్‌గా లేదు కానీ కొంత సమస్యయితే ఉంది అని పేర్కొంది.

చదవండి: ప్రముఖ నిర్మాత కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement