నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం తర్వాత నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్ మాజీ భార్య శ్యామాలి (Shhyamali) పట్ల చాలామంది సానుభూతి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో తాజాగా ఆమె ఒక పోస్ట్ చేశారు. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం అడుతున్నారని చెప్పారు. అయితే, తాను ఈ అవకాశం ఎవరికీ ఇవ్వనని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిలో తన నుంచి బ్రేకింగ్ న్యూస్‌లతో పాటు ఇంటర్వ్యూలు ఎవరూ ఆశించవద్దని కోరారు. సమంత - రాజ్ నిడిమోరు వివాహ గురించి తాను పట్టించుకోవడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
సమంత- రాజ్‌ల వివాహం తర్వాత తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని శ్యామాలి ఇప్పటికే ఒక పోస్ట్ చేశారు. చాలా మంది నాపై అభిమానం చూపారు. వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను ఎవరి గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. మా గురువు గారు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నా సోషల్‌మీడియా ఖాతాను కూడా నేనే మెయిన్‌టెన్ చేస్తాను. అందుకోసం నేను పీఆర్‌ను పెట్టుకోలేదు. మా గురువు గారి ఆరోగ్యం పట్ల ఇప్పటికే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా అలసిపోయాను. కాబట్టి ఎవరూ కూడా నా నుంచి బ్రేకింగ్‌లు ఆశించకండి. ఆపై ఇంటర్వ్యూల కోసం ఎదురుచూడకండి.' అని శ్యామాలి కోరారు.


