breaking news
Shhyamali De
-
సమంత- రాజ్ డేటింగ్ వార్తలు.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తనపై వచ్చిన రూమర్స్‌పై ఇప్పటికీ వరకు స్పందించని సామ్.. తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సన్నిహితంగా ఉంటూ కనిపించింది. గతంలోనే విమానంలో తన భుజంపై వాలిపోయి మరి ఫోటోలకు పోజులిచ్చిన సమంత.. ఇప్పుడు ఏకంగా అతనే సమంత భుజంపై చేయి వేసుకుని అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ నెట్టింట వైరలవుతోంది. ఇక అఫీషియల్ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పోస్టులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్ వార్తలొస్తున్న వేళ.. రాజ్ నిడిమోరు భార్య మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసింది. సామ్- రాజ్ ఫొటోలు వైరల్‌గా మారిన తర్వాత ఆయన భార్య శ్యామాలి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ మేసేజ్ రాసుకొచ్చింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని రాసుకొచ్చింది. అందులో వివిధ మతాల అర్థాలను వివరిస్తూ "లైఫ్స్ గ్రేట్ గోల్డెన్ రూల్" అనే శీర్షికతో పోస్ట్ చేసింది. ఆ తర్వాత అర్జునుడు, కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించింది. అర్జునుడు.. విజయం, ఓటమి కాకుండా మరొకటి ఏంటి? అంటే.. శ్రీకృష్ణుడు ధర్మం మాత్రమే ముఖ్యమని చెప్పాడని అనే అర్థం వచ్చేలా స్టోరీస్‌లో రాసింది. అంటే తనకు ధర్మమే అండగా నిలుస్తుందని అందులోని సారాంశం. సమంత- రాజ్ డేటింగ్ వార్తల వేళ శ్యామలి చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సామ్ - రాజ్ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఆమె ఈవిధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు.అయితే రాజ్ నిడిమోరుకు భార్య శ్యామలితో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. -
సమంత- రాజ్ డేటింగ్ రూమర్స్.. డైెరెక్టర్ భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. జిమ్‌లో వర్కవుట్స్‌తో పాటు పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. అలా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఇటీవల శుభం మూవీ రిలీజ్ తర్వాత విమానంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను సామ్ షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.తాజాగా ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై పరోక్షంగా స్పందించారు.కాగా.. శుభం మూవీ సక్సెస్ తర్వాత విమానంలో సమంత షేర్ చేసిన ఫోటో చూశాకే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు కనిపించారు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పటివరకు తమపై వస్తున్న వార్తలపై సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు. మరోవైపు సమంత, రాజ్ ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రాజ్ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్ వైరల్!
దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిత్రబృందం రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు. వారిద్దరు డేటింగ్లో ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్ మాత్రం సమంత,రాజ్‌ల గురించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు. కాగా, రాజ్, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్‌లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.