
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తనపై వచ్చిన రూమర్స్పై ఇప్పటికీ వరకు స్పందించని సామ్.. తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సన్నిహితంగా ఉంటూ కనిపించింది. గతంలోనే విమానంలో తన భుజంపై వాలిపోయి మరి ఫోటోలకు పోజులిచ్చిన సమంత.. ఇప్పుడు ఏకంగా అతనే సమంత భుజంపై చేయి వేసుకుని అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నది నిజమేనంటూ నెట్టింట వైరలవుతోంది. ఇక అఫీషియల్ ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరి డేటింగ్ వార్తలొస్తున్న వేళ.. రాజ్ నిడిమోరు భార్య మరోసారి ఆసక్తికర పోస్ట్ చేసింది. సామ్- రాజ్ ఫొటోలు వైరల్‌గా మారిన తర్వాత ఆయన భార్య శ్యామాలి ఇన్స్టా స్టోరీస్‌లో ఓ మేసేజ్ రాసుకొచ్చింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని రాసుకొచ్చింది. అందులో వివిధ మతాల అర్థాలను వివరిస్తూ "లైఫ్స్ గ్రేట్ గోల్డెన్ రూల్" అనే శీర్షికతో పోస్ట్ చేసింది. ఆ తర్వాత అర్జునుడు, కృష్ణుడి మధ్య జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించింది. అర్జునుడు.. విజయం, ఓటమి కాకుండా మరొకటి ఏంటి? అంటే.. శ్రీకృష్ణుడు ధర్మం మాత్రమే ముఖ్యమని చెప్పాడని అనే అర్థం వచ్చేలా స్టోరీస్లో రాసింది. అంటే తనకు ధర్మమే అండగా నిలుస్తుందని అందులోని సారాంశం. సమంత- రాజ్ డేటింగ్ వార్తల వేళ శ్యామలి చేసిన పోస్ట్పై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సామ్ - రాజ్ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఆమె ఈవిధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని కొందరు భావిస్తున్నారు.

అయితే రాజ్ నిడిమోరుకు భార్య శ్యామలితో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు.