'యానిమల్‌' సీక్వెల్‌పై ఆప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి | Sandeep Reddy Vanga announced Animal Park movie schedule | Sakshi
Sakshi News home page

'యానిమల్‌' సీక్వెల్‌పై ఆప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి

Feb 5 2026 9:10 AM | Updated on Feb 5 2026 9:36 AM

Sandeep Reddy Vanga announced Animal Park movie schedule

రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా మూవీ ‘యానిమల్‌’ భారీ విజయం అందుకుంది. దీంతో   సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ‘యానిమల్‌’ వచ్చి సుమారు 3ఏళ్లు కావస్తుంది. కానీ,  సీక్వెల్‌ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి పార్ట్‌-2 గురించి పలు విషయాలు పంచుకున్నారు.

ఫిబ్రవరి 13న యానిమల్‌ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. జపాన్‌ అభిమానులతో సందీప్‌ మాట్లాడుతూ   ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. 2027లో షూటింగ్‌ ప్రారంభిస్తామని ప్రకటించారు. 2028లో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో రణ్‌బీర్‌ హీరోగా, విలన్‌గా నటించనున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్ట్ స్పిరిట్‌ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుందని సందీప్‌ వెల్లడించారు.  

ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత దూకుడుగా ఉంటుందని పేర్కొన్నారు.  2023లో విడుదలైన యానిమల్‌ మూవీ ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది.  ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలుంటాయని గతంలో రణ్‌బీర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement