చిన్న సినిమాలను ప్రోత్సహించాలి  | Former MP Madhu Yashki at Erra Cheera Pre-Release Event | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలను ప్రోత్సహించాలి 

Feb 5 2026 1:35 AM | Updated on Feb 5 2026 1:35 AM

Former MP Madhu Yashki at Erra Cheera Pre-Release Event

– మధు యాష్కీ గౌడ్‌

‘‘ఎర్ర చీర’ మూవీ ట్రైలర్‌ చాలా కొత్తగా అనిపించింది. కచ్చితంగా టికెట్‌ కొనుక్కుని ఈ సినిమా చూస్తాను. చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమాలు తీస్తున్నారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహం లభించాలి. సీఎం రేవంత్‌ రెడ్డిగారు అందుకు కృషి చేస్తున్నారు. ‘ఎర్ర చీర’ విజయం సాధించాలి’’ అని మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్‌ పేర్కొన్నారు.

 సుమన్‌ బాబు దర్శకత్వం వహించి, లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఎర్ర చీర’. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా, బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించారు. బేబీ డమరి సమర్పణలో ఎన్‌వీవీ సుబ్బారెడ్డి, సీహెచ్‌ వెంకట సుమన్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి మధు యాష్కీ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘300 థియేటర్స్‌లో మా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement