breaking news
Erra Cheera Movie
-
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్!
రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తొలి చిత్రం ‘ఎర్రచీర’. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ‘ఏ(A)’ సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు. -
ఆ రోజే థియేటర్స్‌లోకి ‘ఎర్రచీర’
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ఎర్రచీర - ది బిగినింగ్’. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు.సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని దీపావళి కానుకగా వారం ముందే.. అంటే అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలిచాయన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నామని, అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు.


