రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్‌! | Erra Cheera Movie Got A Certificate From Censor Board | Sakshi
Sakshi News home page

రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్‌!

Oct 9 2025 6:57 PM | Updated on Oct 9 2025 7:07 PM

Erra Cheera Movie Got A Certificate From Censor Board

రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తొలి చిత్రంఎర్రచీర’. మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు (A)’ సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement