రవికృష్ణ, నవదీప్, నందు, మనికా చిక్కాల, బింధు మాధవి, రాధ్య, అదితీ భావరాజు, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ము΄్పానేని నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘దండోరా’ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా చిరస్థాయిగా నిలిచి΄ోతుందనిపించింది. సమాజంలోని బలహీనతను దమ్ముతో దండోరా వేయించి చెప్పేందుకు చాలా గట్స్ ఉండాలి.
దర్శకుడు మురళీకాంత్‌కు దమ్ము, ధైర్యం ఉంది. ఈ చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘దండోరా’ సినిమాలో ఏదో ఒక కొత్త విషయం ఉందని జనాల వరకు రీచ్ అయ్యింది. ఈ కథను మాత్రం ఎవ్వరూ ఊహించలేరు’’ అన్నారు నవదీప్. ‘‘ఈ ‘దండోరా’ చిత్రానికి స్టోరీనే హీరో. కంటెంట్ హీరోయిన్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ. ‘‘సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా తీశాను. నా దృష్టిలో నేను విజయం సాధించాను’’ అని పేర్కొన్నారు మురళీకాంత్. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు’’ అన్నారు నటుడు రవికృష్ణ.


