డింపుల్ హయతి, రవితేజ, ఆషికా రంగనాథ్
‘‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాన్ని చాలా అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో తీశారు కిషోర్. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ నెల 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ థియేటర్స్‌లో కలుద్దాం. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు’’అని హీరో రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ–‘‘సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు.
కానీ, సినిమాని చాలా ఫ్యాషన్‌తో చేశారు. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్.. వీరి డైరెక్షన్లో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్ట్స్ శివ నిర్వాణతో చేస్తున్నాను. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోస్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ల. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. డింపుల్, ఆషిక, సునీల్, సత్య, కిషోర్, మురళీధర్, గెటప్ శీను అద్భుతంగా చేశారు. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’అని తెలిపారు.
కిషోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘జనవరి 13న మా బీఎమ్‌డబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కి వెళ్లండి.. అదిరి΄ోతుంది’’ అని సుధాకర్ చెరుకూరి తెలిపారు. ‘‘నాకు డైరెక్టర్‌గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజగారే. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. ‘‘త్వరలోనే రవితేజగారితో సినిమా చేస్తాను’’ అన్నారు డైరెక్టర్ బాబీ. ‘‘ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు’’ అన్నారు డైరెక్టర్ పవన్.


