'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్‌ | SS Rajamouli And Mahesh Babu Varanasi Movie Massive ₹600 Crore OTT Deal Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Varanasi OTT Deal: 'వారణాసి' ఓటీటీ డీల్ 650 కోట్లా..? హాట్ గాసిప్‌

Feb 4 2026 11:03 PM | Updated on Feb 5 2026 11:06 AM

Rajamouli, Mahesh Babu, Varanasi Hot talk about OTT deal

దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది.  

ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్‌స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు.  

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్‌లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది.  

సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్‌లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్‌ సాధ్యపడొచ్చని అంచనా.


650 కోట్ల రేంజ్‌లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది.  ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్‌ అని చెప్పొచ్చు.  

Advertisement
 
Advertisement
Advertisement