
దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిత్రబృందం రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి.
రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్ మాత్రం సమంత,రాజ్‌ల గురించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు.

కాగా, రాజ్, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్‌లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.