breaking news
Emmanuel
-
ఇమ్మానుయేల్ ఎలిమినేషన్.. బ్రదర్ రియాక్షన్
-
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు! -
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్‌బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్‌కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్‌బాస్‌లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్‌బాస్‌లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్‌బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్‌బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది. -
ఇమ్మూని ఆకాశానికెత్తిన బిగ్‌బాస్.. ఇది కదా జర్నీ అంటే!
కొన్ని ఫుడ్ ట్రీట్స్, ఇంటినుంచి సర్ప్రైజ్లు అందుకునేందుకు బిగ్‌బాస్ సరదా గేమ్స్ పెడుతూ వస్తున్నాడు. ఇందులో గెలిచిన పవన్‌కు ఇంటినుంచి వీడియో సందేశం రాగా తనూజకు ఫ్యామిలీ ఫోటో అందింది. మరి ఈసారి ఆ సర్ప్రైజ్ ఎవరు గెల్చుకున్నారో బుధవారం (డిసెంబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు వీడియో మెసేజ్బాల్స్ విసిరే గేమ్‌లో కల్యాణ్ గెలిచి ఒక స్టార్తోపాటు స్వీట్ పొందాడు. ప్లేయర్ ఆఫ్ దిడేగా సంజనాను ఎంపిక చేయడంతో తన చెల్లెలు, హీరోయిన్ నిక్కీ గల్రానీ వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఇక ఇమ్మాన్యుయ్యేల్ జ్యోతిష్యుడిగా మారి హౌస్మేట్స్ జాతకాలు చెప్పడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత ఫైనలిస్టుల కోసం గ్రాండ్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది. గార్డెన్ ఏరియాలో తను ఆడిన టాస్కులు, వాటి ఫోటోలు చూసి ఎమోషనలయ్యాడు. అసలైన ఎంటర్టైనర్ఇక బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బాధ, నిరాశ, ఓటమి.. ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ, అది సాధ్యం కాదు. వాటి నుంచి తేరుకునేందుకు మనుషులు కోరుకునేది ఆనందం. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. చిన్నప్పటినుంచి కష్టాలను అనుభవించినవారికే చిరునవ్వు బలమేంటో బాగా తెలుసు. అదే బలంగా మీరు ముందుకు సాగారు. నీ ఆటతో మిగతావారి ఆటస్థాయి పెంచారు. ఇమ్మూపై బిగ్‌బాస్ ప్రశంసలుఇంటిసభ్యులు మీకు దగ్గరైనవారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాటమార్చలేదు, అలా అని వారి తోడు వీడలేదు. మీ ఆటలో, భావాల్లో నిజాయితీగా ఉన్నారు. మంచివైపే నిల్చున్నారు. మీకు దగ్గరైనవాళ్లు చేసింది తప్పనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఎన్ని జరిగినా ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు.అమ్మ కల నెరవేరిందిప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులూ, ఆడంబరాలు అక్కర్లేదు. వ్యక్తిత్వం ఒక్కటే అవసరం. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్‌గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కల నిజమైంది అని బిగ్‌బాస్ చెప్పడంతో ఆనందభాష్పాలు కార్చాడు. తర్వాత తన జర్నీ చూసుకుని ఓపక్క సంతోషిస్తూనే.. మరోపక్క గుక్క పెట్టి ఏడ్చాడు. కట్టకాలే వరకు అందర్నీ నవ్విస్తూనే ఉంటానని మాటిచ్చాడు. -
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.ఒక్కవారంలో అంతా అయిపోయిందా?అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.ఏడ్చేసిన డిమాన్ పవన్డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.టాప్ 5 ఎమోషనల్కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. -
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
ప్రతి సీజన్లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు. చివరి గేమ్‌లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. -
గేమ్‌లో సడన్‌గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్ రూమ్‌కు!
టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.నేనూ మనిషినే..కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్‌లో మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్‌లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.నొప్పితో విలవిలతర్వాత లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది. -
బిగ్‌బాస్ హౌస్‌లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
ఇది ఫెయిర్ కాదు బిగ్‌బాస్ పేరిట హౌస్‌లో ఇమ్యూనిటీ చాలెంజ్ నడుస్తోంది. ఇప్పటికే ఓ గేమ్ పూర్తవగా లేటెస్ట్ ఎపిసోడ్లో మరో రెండు గేమ్స్ పెట్టారు. అలాగే బిగ్‌బాస్ ప్రియులు హౌస్‌లోకి వెళ్లి మాట్లాడారు. ఆ విశేషాలేంటో మంగళవారం (డిసెంబర్ 9వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు సీక్రెట్ టాస్క్మూడుసార్లు జైలు నుంచి బయటకు రావాలని సంజనాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఆమె తెలివిగా ఆరోగ్యం బాలేదంటూ మూడుసార్లు జైలు ఓపెన్ చేయించింది. అలా ఆమె జైలు జీవితం రద్దవడంతో పాటు ఏ గేమ్ ఆడకుండానే 20 పాయింట్లు గెలుచుకుంది. ఇక ఇమ్యూనిటీ రేసులో భాగంగా రెండో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇమ్మూ గెలవగా డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచాడు. సుమన్, తనూజ, సంజనా, భరణి తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారు.గేమ్ నుంచి తప్పించే ఛాన్స్మూడో గేమ్‌లో ఒకరు ఆడకుండా సైడ్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్. ఇమ్మూ.. సంజనాను పక్కకి పిలిచి అదిరిపోయే సలహా ఇచ్చాడు. వాళ్లు ముగ్గురూ (భరణి, తనూజ, సుమన్) కచ్చితంగా మా ఇద్దరి (పవన్, ఇమ్మ)లో ఒకరి పేరు చెప్తారు. కాబట్టి నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే, నేను, పవన్, కల్యాణ్ కూడా అదే చెప్తాం. దీనివల్ల లీడర్ బోర్డులో చివర్లో ఉన్న నువ్వు ముందుకొస్తావ్ అని ఐడియా ఇచ్చాడు. కానీ, సంజనా వింటేగా.. నేను నీ పేరు కాదు, పవన్ పేరు చెప్తున్నా అంది.ప్లేటు తిప్పేసిన సంజనానువ్వు పవన్ పేరు చెప్తే.. వాళ్లంతా నా పేరు చెప్తారు, అలా నేను బలవ్వాల్సి వస్తుంది అని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో భరణి, సుమన్, తనూజ.. ఇమ్మూ అనుకున్నారు. కానీ సంజనా ఒక్కరే డిమాన్ పవన్ పేరు చెప్పింది. పవన్, కల్యాణ్.. సంజనా పేరు చెప్పారు. దీంతో ఇమ్మూ.. తనను కాపాడుకోవడం కోసం సంజనా పేరు చెప్పక తప్పదన్నాడు. అలాగైతే తాను డేంజర్లో పడతానని అర్థమైన సంజనా.. వెంటనే తన నిర్ణయం మార్చుకుంది. తనూజ వర్సెస్ సంజనాపవన్కు బదులుగా ఇమ్మూని తీసేస్తానంది. అందుకు తనూజ ఒప్పుకోలేదు. అలాగైతే నేనూ నా నిర్ణయం మార్చుకుంటా.. అంటూ సంజనా పేరు చెప్పింది. ఇక్కడ వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. చివరకు ఇమ్మాన్యుయేల్.. సంజనా పేరు చెప్పాడు. అలా సంజనాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నెక్స్ట్ గేమ్ ఆడటానికి వీల్లేదని బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న ఇమ్మూ, పవన్.. గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.ఇమ్మూ ఓట్ అప్పీల్వీరి కోసం కొందరు ప్రేక్షకులు బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చారు. మెజారిటీ జనం ఇమ్మూ (Emmanuel) ఓట్ అప్పీల్ గెల్చుకోవాలని కోరారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు నాకు ఓటేస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మూడుసార్లు కెప్టెన్ అయ్యాను. ఇంట్లోని పరిస్థితులను తట్టుకుని అందర్నీ నవ్విస్తున్నాను. వీలైనన్ని గేమ్స్ గెల్చుకుంటూ వచ్చాను. ఓట్ అప్పీల్ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క. దయచేసి నాకు ఓటేయండి. ఒక్క ఎంటర్టైనర్ అయినా కప్పు గెలవాలని ఆడుకుంటూ వచ్చాను. నాకు ఓటేసి టాప్ 5లో ఉంచుతారని అనుకుంటున్నాను అని ఓట్ అప్పీల్ అడిగాడు. తర్వాత ప్రేక్షకులతో కాసేపు చిట్‌చాట్ చేశాడు. కప్పు గెలవగానే ఫస్ట్ అమ్మ చేతికి ఇస్తానని, తర్వాత ప్రేయసి చేతిలో పెడతానని చెప్పాడు.చదవండి: షూటింగ్‌కు ఫారెస్ట్ పోదాం చలోచలో -
నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కల్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా అందర్నీ ఈ వారం నామినేషన్లో వేశాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరు ఎక్కువ గేమ్స్ గెలిచి లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంటారో వారికి ఇమ్యూనిటీ గెలిచే ఛాన్స్ ఉంది. నిజంగా ఇమ్యూనిటీ గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ వీక్‌లో అడుగుపెట్టినట్లే లెక్క! మరి ఆ గేమ్స్ ఎలా జరిగాయో సోమవారం (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..మనీ బాక్స్సడన్గా బిగ్‌బాస్‌కు ఏమనిపించిందో ఏమో కానీ, ఇంతవరకు కెప్టెన్ అవలేదు కదా.. అంటూ భరణిని కెప్టెన్ చేశాడు. కాకపోతే ఇమ్యూనిటీ లభించదని నొక్కిచెప్పాడు. తర్వాత గార్డెన్ ఏరియాలో బాక్సులు పెట్టారు. అందులో జీరో నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు అంకెలు రాసిపెట్టారు. ఇప్పటివరకు కంటెస్టెంట్ల జర్నీని బట్టి వారికి బాక్సులు ఇవ్వాల్సి ఉందన్నాడు. ఈ పాయింట్స్ విజేత ప్రైజ్‌మనీపై ఎఫెక్ట్ చూపిస్తాయన్నాడు.సంజనాకు అన్యాయం?అలా డిమాన్.. సుమన్‌కు లక్ష ఇద్దామనుకోగా అందుకు అందరూ ఓకే చెప్పారు. తర్వాత భరణి.. తనూజకు రూ.2 లక్షలు ఇచ్చాడు. అనంతరం కల్యాణ్ ఇమ్మూకి రూ.2.5 లక్షలు రాసి ఉన్న బాక్స్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు రూ.1.50 లక్షల బాక్స్ ఇస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అనంతరం సుమన్.. డిమాన్‌కు రూ.1.50 లక్షలిచ్చాడు. చివరగా భరణి, సంజన మిగిలారు. జైలుకు సంజనాసంజనాకు రూ.50 వేలు రావాలని ఇమ్మూ, పవన్ సపోర్ట్ చేస్తే మిగిలినవారు భరణికి సపోర్ట్ చేశారు. మెజారిటీ అతడివైపే ఉండటంతో భరణికి రూ.50 వేలు దక్కగా.. సంజనాకు జీరో లభించింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను జైల్లో వేశాడు. తనకు జీరో రావడాన్ని సంజనా తట్టుకోలేకపోయింది. తల్లిలా ఆలోచించి ఎమోషనల్ ఫూల్ అవుతున్నా.. ప్రతివారం నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది.గెలిచేసిన ఇమ్మూతర్వాత ఈవారం ఇమ్యూనిటీ కోసం కొన్ని ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డులో టాప్‌లో ఉండేవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవడంతోపాటు ప్రేక్షకులను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం సంపాదిస్తారు. మొదటి గేమ్‌లో సంజనా పాల్గొనేందుకు వీల్లేదన్నాడు. అలా బిగ్‌బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ 'స్వింగ్ జరా'లో ఇమ్మూ గెలవగా.. భరణి, పవన్, తనూజ, సుమన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరి తర్వాతి టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఎవరు టాప్‌లో ఉన్నారో చూడాలి! -
తనూజకు క్లాస్ పీకిన నాగ్.. వాళ్లు ట్రోఫీకి అనర్హులు!
టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. ఇమ్మాన్యుయేల్ తాడు వదిలేయడం వీడియో వేసి చూపించాడు. అలాగే భరణి ట్రయాంగిల్ గోల గురించి చర్చించాడు. అనవసరమైన గొడవ మొదలుపెట్టిందే తనూజ అని క్లాస్ పీకాడు. అలాగే పవన్ ఓడిపోయిన ప్లాంకుల టాస్కు గురించి మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రవర్తించావు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టికెట్ టు ఫినాలే గెలుస్తానని చెప్పి ఓడిపోయావ్ అని సెటైర్లు వేశాడు. మరి తర్వాతేం జరిగిందో శనివారం (డిసెంబర్ 6వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సుమన్ అనర్హుడుబిగ్బాస్ ట్రోఫీకి తామెందుకు అర్హులో హౌస్మేట్స్ చెప్పాలన్నాడు. మొదటగా సుమన్.. గేమ్ బాగా ఆడుతున్నాను, ఆ మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నాడు. ఆయనకు కప్పు గెలిచే అర్హత లేదని సంజనా, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ అభిప్రాయపడ్డారు. తనూజ, భరణి, కల్యాణ్ మాత్రం ఆయనకు గెలిచే అర్హత ఉందన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జనాలను ఎంటర్టైన్ చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఏ సీజన్లోనూ కమెడియన్ గెలవలేదు. ఈ సీజన్లో నేను గెలవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆయన మాటలతో హౌస్మేట్స్ అందరూ ఏకీభవించారు. వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదుతర్వాత భరణి.. నాకు దెబ్బలు తగిలినా సరే ఎక్కడా తగ్గకుండా ఆడాను. కంటెంట్ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పవన్‌ను ఓడించాను. కచ్చితంగా కప్పుకు అర్హుడినే అన్నాడు. రీతూ, పవన్ మినహా మిగతా అందరూ ఆయన మాటలతో ఏకీభవించారు. సంజనా.. నేను మాస్క్ వేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. చూసిందే మాట్లాడాను. నిజాయితీగా ఉన్నాను అని చెప్పగా సుమన్, భరణి, పవన్ ఆమెకు కప్పు గెలిచే అర్హత లేదని భావించారు.కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నా ఇల్లు అనుకున్నాను. ఏ పని చెప్పినా అన్నీ చేశాను. ఎక్కడా మాట తప్పలేదు. బంధాల వల్ల గేమ్ తగ్గిపోతుందని తెలిసినా నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. అన్ని టాస్కుల్లోనూ బాగానే ఆడాను అని చెప్పుకొచ్చాడు. అతడికి రీతూ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ మాత్రమే సపోర్ట్ చేశారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్.. ఈ మూడింటితోపాటు కమిట్మెంట్తో ఆడాను.లేడీ విన్నర్అందరితో బాగున్నా.. జెన్యూన్‌గా ఆడా.. ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పగా అందరూ ఇతడు అర్హుడనే తలూపారు. తనూజ మాట్లాడుతూ.. నాకు కుటుంబం, వర్క్ ప్లేస్ తప్ప మిగతాది తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానంటే ఇప్పటికీ ఓ కలలా ఉంది. ఎక్కడా ఫేక్‌గా ఉండకుండా జెన్యూన్‌గా ఉన్నాను. నావల్ల అయినంతవరకు ఆడాను. లేడీ విన్నర్ అవ్వాలని, అది నేనే అవాలనుకుంటున్నా అని చెప్పింది. అందరూ ఆమె చెప్పింది కరెక్టేనన్నారు.ముగ్గురికే కప్పు గెలిచే అర్హతరీతూ మాట్లాడుతూ.. ప్రతి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నాకు ఏదనిపిస్తే అది చేశాను. గెలిచినా, ఓడినా.. ఎలా అయినా ఫైనల్స్‌లో ఉండాలన్న కసితోనే ఆడాను. ఏదో ఒకటి చేసి ముందుకెళ్లాలన్న తపనతోనే ఉన్నాను అని పేర్కొంది. సుమన్, భరణి తప్ప మిగతా అందరూ ఆమెకు అర్హత ఉందని ఓటేశారు. మొత్తానికి ఈ ఓటింగ్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ మాత్రమే అర్హులంటూ వారికి పూర్తిస్థాయిలో ఓట్లు పడ్డాయి.చదవండి: బిగ్‌బాస్ 9 షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ అవుట్ -
కల్యాణ్‌కు నాగ్ సెల్యూట్.. ఇమ్మూ చీటింగ్ బట్టబయలు!
వీకెండ్లో ముందు ఫైర్ చూపించి, తర్వాత సరదాగా ఉంటాడు కింగ్ నాగార్జున. కానీ, ఈసారి ఫైర్‌ను పక్కనపెట్టేసి అందరితో కబుర్లు చెప్తూ కూల్‌గా కనిపించాడు. ముందుగా పవన్‌ను లేపి అతడి డ్రెస్ బాగుందన్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇమ్మాన్యుయేల్.. ఆ డ్రెస్‌లో పవన్ మ్యాజిక్ షోలు చేసేవాడిలా ఉన్నాడని కామెడీ చేశాడు. షర్ట్‌లో నుంచి పావురాలు, పాములు తీస్తాడని సెటైర్లు వేశాడు. కల్యాణ్‌కు సెల్యూట్ఆ సంగతిని నాగ్ గుర్తు చేస్తూ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను అభినందించాడు. అతడు చివరి కెప్టెన్ అయినప్పుడు ఎలాగైతే సెల్యూట్ చేశాడో, ఇప్పుడు కూడా అలాగే మరోసారి సెల్యూట్ చేసి మరీ ప్రశంసించాడు. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో ఇమ్మాన్యుయేల్ చేసిన తప్పును వీడియో వేసి చూపించాడు నాగ్.తప్పును ఎత్తి చూపుతూనే పొగడ్తలుసంజనాతో ఇమ్మూ పోటీపడ్డ టాస్క్ అది. అందులో ఇమ్మాన్యుయేల్ తాడును మధ్యలో ఒకసారి వదిలేశాడు. గేమ్ రూల్స్ ప్రకారం తాడు వదిలేస్తే ఔట్.. కానీ దాన్ని సంచాలక్ రీతూ గమనించకపోయేసరికి అతడే గెలవడం.. అలా తర్వాతి టాస్కులు కూడా గెలిచి చివరి వరకు రావడం జరిగింది. అలా తాడును వదిలేయడాన్ని తప్పుపట్టిన నాగ్.. లెక్కల్లో మాత్రం ఇరగ్గొట్టేశావ్.. అని మెచ్చుకున్నాడు. చదవండి: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: రాజ్ పిన్ని -
భరణికి అన్యాయం! కనిపెట్టేసిన తనూజ
టికెట్ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్, పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్ 4వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ విన్నర్మొదటగా కలర్ గేమ్ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్ కలర్ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు! టార్గెట్ భరణిఈ ఆటలో కల్యాణ్ గెలవడంతో సుమన్ రేసు నుంచి అవుట్ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్.. కలిసి భరణిని టార్గెట్ చేశారు. ఇమ్మూ, కల్యాణ్.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్ చేశారు. వీళ్ల ప్లాన్ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్ బ్యాలెన్స్ గేమ్ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్, ఇమ్మూ, రీతూ స్టిక్స్ పట్టుకుంటే దానిపై హౌస్మేట్స్ కాయిన్స్ పెట్టాల్సి ఉంటుంది.ఫస్ట్ ఫైనలిస్ట్ అతడేనా?ఇమ్మూ, కల్యాణ్ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్- స్క్వేర్ అంటూ ఓ గేమ్ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే! ఇక ఈ టికెట్ టు ఫినాలే కల్యాణ్ గెలిచినట్లు తెలుస్తోంది. -
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
టికెట్ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్ బ్యాంక్ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో టికెట్ టు ఫినాలే.. సుమన్, భరణి, సంజనా, రీతూ, పవన్.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్ ఉంది. టికెట్ టు ఫినాలేవీళ్లు టికెట్ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయి మరీ ఫైనల్లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురి మధ్యే పోటీఅలాగే భరణి కూడా ఔట్ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్మేట్స్ (సంజన, భరణి, సుమన్, పవన్)కి టాప్ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి! -
రీతూ పరువు పాయే.. దుమ్ము దులిపేసిన ఇమ్మూ, తనూజ
ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలిస్తున్నానన్నాడు బిగ్‌బాస్. రణరంగంలో ఎవరెక్కువ గడులు (బాక్స్‌లు) గెల్చుకుంటే వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో కొన్ని గేమ్స్ జరిగాయి. అందులో ఎవరు గెలిచారో మంగళవారం (డిసెంబర్ 2వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ ఒకటే గొడవకంటెస్టెంట్లందరూ చదరంగంలాంటి బాక్స్‌లో ఒక్కో కలర్ ఎంచుకున్నారు. చివరకు ఆ బాక్స్‌లో ఎవరి కలర్ ఎక్కువ ఆక్రమించుకుంటుందో ఆ కంటెస్టెంట్లే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పారు. ఫస్ట్ గేమ్‌లో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్ ఆడతారని తనూజ ప్రకటించింది. అందుకు రీతూ ఒప్పుకోలేదు. ఫస్ట్ గేమ్ నేనే ఆడతానని వాదించింది. దీంతో పవన్ తప్పని పరిస్థితిలో వెనకడుగు వేశాడు.పరువు పాయేఅలా ఇమ్మూ, కల్యాణ్, రీతూ.. మొదటి గేమ్ కనుక్కోండి చూద్దాం ఆడారు. మెదడుకు పదును పెట్టే ఈ గేమ్‌లో రీతూ ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయింది.. ఆడతా.. ఆడతానంటూ దూకుడు చూపించి మరీ బొక్కబోర్లా పడింది. ఆమె పరిస్థితి చూసిన బిగ్‌బాస్ తనకసలు లెక్కలు వచ్చా? రావా? అని టెస్ట్ చేసేందుకు రెండో ఎక్కం చెప్పమన్నాడు. దీనికి ఆలోచించుకుంటూనే సెకండ్ టేబుల్ కరెక్ట్‌గా చెప్పింది. ఈ గేమ్‌లో అంతో ఇంతో కల్యాణ్ నాలుగు పాయింట్లు గెలిచాడు. ఇమ్మూ ఆరు పాయింట్లతో ఈ రౌండ్ విజేతగా నిలిచాడు. సంజనా ఔట్తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజనా (Sanjana Galrani)తో బాల్స్ గేమ్ ఆడి గెలిచాడు. ఆటలో ఓడిపోయినందుకు సంజనా బోరుమని ఏడ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసు నుంచి సంజనా వైదొలిగింది. తర్వాత పూల గేమ్‌లో భరణి, తనూజ, డిమాన్ పవన్ తలపడ్డారు. ఫిజికల్ అవుతున్నావ్, ఫిజికల్ అవుతున్నావ్ అని తనూజ పదేపదే అనేసరికి పవన్ కాస్త సైలెంట్ అయిపోయాడు. అలా తెలివిగా ఈ ఆటలో తనూజ గెలిచింది. తర్వాతి తన గేమ్ కోసం సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి! -
బిగ్‌బాస్9: ఈసారి లేడీ విన్నర్? లేదా కల్యాణ్ గెలుస్తాడా?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్ వన్‌సైడ్ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.తనూజ చుట్టూ బిగ్‌బాస్ 9ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ. బలమైన ఓటింగ్అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో (ఓటీటీ సీజన్ మినహా) తొలి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది.నెక్స్ట్ పవన్ కల్యాణ్ పడాలమొదట్లో కల్యాణ్ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కాడు. ఇది టాప్ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు. మరో పల్లవి ప్రశాంత్జై జవాన్ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్లో ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ నినాదాలు మొదలుపెట్టారు.మంచోడే కానీ ఎక్కువ హైప్కల్యాణ్కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మిగిలింది ఇమ్మాన్యుయేల్ఇమ్మాన్యుయేల్ (Emmanuel) ఆల్‌రౌండర్. గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్ అంటే భయం. ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్ అయింది. కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. సూట్‌కేస్ తీసుకోవడం మేలుకానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్లో తన స్థానం టాప్ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్? పవన్ ఓడించి మరీ.. -
ఇమ్మూపై ఒత్తిడి.. దివ్య సేఫ్.. హర్టయిన తనూజ
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) భలే తెలివైనోడు.. ఇమ్మాన్యుయేల్‌తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్(నవంబర్ 23)లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారో చూసేద్దాం..సుమన్ కోసం పిల్లలుసుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్లను చూడగానే సుమన్‌కు కళ్లలో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. గేమ్ బాగా ఆడాలని సుమన్‌కు సూచించాడు. సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్‌ను టాప్ 5లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనల్లుడు వచ్చారు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్మూ, కల్యాణ్, తనూజ, సుమన్‌ను టాప్ 5లో పెట్టారు.రీతూ కోసం అఖిలతర్వాత రీతూ కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగెటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావ్ అని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డిమాన్ పవన్‌ను టాప్ 5లో పెట్టారు. అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది. మనీష్‌కు కౌంటర్పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం.. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి.. ముద్దుముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్‌కు ఇప్పుడు కౌంటరిచ్చింది. ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త.. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది.దివ్యను కాపాడేందుకు స్కెచ్డిమాన్ పవన్ (Demon Pavan) కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. నాకు నీతి, నిజాయితీగా ఉండటమే వచ్చు.. నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూను టాప్ 5లో పెట్టారు. అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్.నో ఎలిమినేషన్ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈవారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు? తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్రెడీ నాగ్.. దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హర్ట్ అయినట్లే కనిపిస్తోంది!చదవండి: సిక్స్ ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్ -
ఈ వారం నో ఎలిమినేషన్.. టాప్ 5లో వీళ్లేనా?!
సుమన్ చేసిన పొరపాటు వల్ల, తనూజ కంగారు వల్ల కెప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది. రీతూ కెప్టెన్‌గా గెలిచింది. ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్ రాగా వీకెండ్లో కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. టాప్ 5లో ఎవరుంటారో తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ విశేషాలు శనివారం (నవంబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..జీవితంలో ముఖం చూడను(Bigg Boss Telugu 9) తనూజతో జరిగిన గొడవ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది దివ్య. మీకిష్టం లేకపోయినా మీ వెంటపడుతున్నానని కామెంట్స్‌తో బాధపెట్టింది. బయటకెళ్లాక జీవితంలో తన ముఖం చూడను అంది. నాగార్జున స్టేజీపైకి వచ్చి తనూజ- దివ్య గొడవ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్ అవగానే కళ్లు నెత్తికెక్కాయా? అని తనూజకు క్లాస్ పీకాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసిందే నువ్వని దివ్యను తిట్టిపోశాడు. అలా ఇద్దరికీ కాస్త గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీపైకి పిలిచాడు.తనూజ నా మనవరాలుమొదటగా భరణి (Bharani Shankar) తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజీపైకి వచ్చాడు. తనూజ (Thanuja Puttaswamy)ను మనవరాలు అని పిలిచిన భరణి తల్లి.. దివ్యను మాత్రం పరోక్షంగా జాగ్రత్త అని హెచ్చరించింది. కొడుకుపై అరవొద్దు అన్నట్లుగా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది. వీళ్లు.. భరణి, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనను టాప్ 5లో వరుసగా పెట్టారు. కల్యాణ్ తండ్రి గొప్ప మాటలుతర్వాత కళ్యాణ్ కోసం తండ్రి లక్ష్మణ్‌రావు, తమ్ముడు బాలు వచ్చారు. కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, పవన్‌ను టాప్ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ అన్నతో పాటు కమెడియన్ అవినాష్ వచ్చారు. ఇమ్మూ, తనూజ, కల్యాణ్, పవన్, రీతూని టాప్ 5లో పెట్టారు. అవినాష్ తనూజకు మహానటి, కట్టప్ప అవార్డులు ఇచ్చాడు.టాప్5 చివర్లో దివ్యతర్వాత దివ్య తాతయ్య, స్నేహితురాలు వచ్చారు. వీళ్లిద్దరూ.. ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్, దివ్యను టాప్ 5లో పెట్టారు. దివ్యను చివర్లో పెట్టిన తాతయ్య.. నువ్వింకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇకపోతే ఈ వారం దివ్య-తనూజ గొడవతో టీఆర్పీలు బద్ధలైపోయాయట. దీంతో బిగ్‌బాస్ టీమ్ దివ్యను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించేందుకు సిద్ధమైందట! ఆ సంగతులు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.. -
ఏయ్, నువ్వేం పొడిచావ్? సీజన్లోనే పెద్ద లొల్లి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లోకి చివరగా ఇమ్మాన్యుయేల్ తల్లి వచ్చింది. నేను వద్దనుకున్న కొడుకే ఈరోజు నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చాడని తెగ మురిసిపోయింది. కొడుక్కి ప్రేమగా గోరుముద్దలు తినిపించింది. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 21వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూకి డబుల్ ధమాకాఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు బిగ్‌బాస్ డబుల్ బొనాంజా ఇచ్చాడు. తల్లిని బయటకు పంపించేశాక ప్రియురాలు పంపిన లేఖ, ఎంగేజ్మెంట్ రింగ్‌ను ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇది చూసి ఇమ్మూ తెగ సంబరపడిపోయాడు. తర్వాత ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ముందుగా కెప్టెన్సీకి అనర్హులు అనుకున్నవారిని గేమ్‌లో నుంచి తీసేయాలన్నాడు. దాంతో మొదటగా దివ్య.. తనూజ పేరు చెప్పింది. పర్సనల్ అటాక్ఆల్రెడీ రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్లీ ఇంకో వారం ఇమ్యూనిటీ అవసరం లేదంటూ తనూజను తీసేసింది. అది తనూజకు నచ్చలేదు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావ్? అంటూ ఒంటికాలిపై లేచింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. బయట రివ్యూలు సరిపోవన్నట్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నావ్.. నువ్వే సింపథీ స్టార్ అంటూ తనూజ మరింత అగ్గిరాజేసింది.గేమ్ కోసం వాడుకోనునీలాగా మనుషుల్ని గేమ్ కోసం వాడుకోను అని దివ్య.. ఒక మనిషి ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావ్.. అని తనూజ మధ్యలో భరణిని లాగారు. దాంతో ఆయన మధ్యలో నన్ను లాగొద్దని చెప్పానుగా అని అసహనం వ్యక్తం చేశాడు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. నేను నీకంటే బెటర్‌గా ఆడా.. అందరిదగ్గరికెళ్లి కెప్టెన్సీ అడుక్కోలేదు.. నిన్ను భరించలేక నన్ను గతంలో కెప్టెన్ చేశారు. నువ్వేం పొడిచింది లేదు. సీరియల్ స్టార్ అంటూ దివ్య తనూజను ఏకిపారేసింది. చివరకు ఆ ఇద్దరుఅలా వీరి గొడవతో హౌస్‌ను తగలబెట్టేసినంత పని చేశారు. దివ్య తర్వాత మెజారిటీ ఇంటిసభ్యులు తనూజను కెప్టెన్‌గా వద్దన్నారు. దీంతో ఆమె గేమ్‌లో లేకుండా పోయింది. అయితే హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించే బాధ్యతను తనూజకు అప్పగించాడు బిగ్‌బాస్. దీంతో ఆమె పవన్, కల్యాణ్, రీతూ, సుమన్‌ను బ్లూ టీమ్‌గా మిగిలినవారిని రెడ్ టీమ్‌గా విభజించింది. వీరికి ఓ మాన్స్టర్ గేమ్ ఇచ్చాడు. ఇందులో చివరకు సుమన్, రీతూ మిగిలారు. అయితే రీతూ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్! కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చేసింది. తనూజ, కల్యాణ్, సుమన్, భరణి, దివ్య, డిమాన్ పవన్, రీతూ, సంజన.. ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చి వెళ్లారు. చివరగా ఇమ్మూ ఒక్కడే మిగిలాడు. ఈరోజు అతడి తల్లి బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజైంది.ఏడవద్దు డాడీఇమ్మూ తల్లి అంటూ కొడుక్కి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టింది. తాను కొనిచ్చిన బంగారు గాజులు వేసుకుని రావడం చూసి ఇమ్మూ మురిసిపోయాడు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో.. ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు.. ఏడవద్దు డాడీ అంటూ కొడుకు కన్నీళ్లు తుడిచింది. కమెడియన్‌గా వచ్చావ్.. హీరోగా బయటకు రావాలంది.తల్లి కోసం పాటకొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా అందరితో బాగానే కామెడీ చేసింది. చివర్లో ఇమ్మూ.. సువ్విసువ్వాలమ్మా పాట పాడి అందరి మనసులు పిండేశాడు. ఇక ఇమ్మూ తల్లి కొడుక్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో చూడాలి. అలాగే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరగ్గా రీతూ చౌదరి కొత్త కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: దివ్యకు దూరంగా ఉండు: భరణికి కూతురి సలహా -
సంజన కోసం రీతూ త్యాగం.. ఇలాగైతే తనూజ గెలవడం కష్టమే!
వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూతో గొడవనీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్‌గా ఫీలవుతా.. అది నా వీక్నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు. నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకుమూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది. తనూజకు నాగ్ సలహాసారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు. రీతూ గెలిస్తేనే ఆఫర్ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్‌కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్‌ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.గౌరవ్ ఎలిమినేట్కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.చదవండి: గౌరవ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే? -
కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడం విశేషం! మరి తర్వాత హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 14వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నన్నెందుకు ఎత్తుకోలేదు?తనూజ కెప్టెన్ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్మేట్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్‌బాస్. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.చస్తా.. ఏడుస్తా..నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్.. ఏడుపు ఆపేయ్ అనడం తప్పా? అని కల్యాణ్ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్ పార్ట్.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్ నన్ను అని చిరాకుపడింది.గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్తర్వాత కల్యాణ్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్‌లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్ క్లాస్‌లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఏడిపించేసిన ఇమ్మూకానీ నెలకోసారి మాత్రమే ఫోన్ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్‌కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. నా జీవితంలో సూపర్ హీరోచిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. అంతా అమ్మ వల్లే..తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. రౌడీగా దివ్యతర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్ పవన్.. చెస్ ఛాంపియన్‌గా మెడల్ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్ అవుతానంది. సుమన్‌కు చైల్డ్‌హుడ్ ఫోటో అందింది. కానీ గౌరవ్, సంజనా, భరణి, నిఖిల్ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్ ఇదే! -
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.లవ్యూ అమ్మా: తనూజవాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్ సూపర్ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.తినడానికి తిండి లేక మట్టిఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్ కోసం వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కల్యాణ్‌ను ఓడించి.. ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా -
బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్‌కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్‌తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్‌లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్‌లో ఏం జరిగిందో నవంబర్ 9వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఇద్దరికీ సమాన ఓట్లుట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్‌కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్మేట్స్ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్‌ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్ పవన్‌కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్‌కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్ చేశారు.దివ్యకు వాయింపులుఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు నాగ్. దివ్య స్ట్రాటజీ కరెక్ట్.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్‌కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్‌గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్ ఫైట్ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇమ్మూని హెచ్చరించిన నాగ్ఇక బిగ్‌బాస్ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్‌తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్, నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్‌లోకి రాకుండా సడన్‌గా వస్తే.. అప్పటికే ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్‌లోకి రమ్మని వార్నింగ్ ఇస్తూనే డైరెక్ట్‌గా హింటిచ్చాడు.పవర్ వాడేందుకు ఒప్పుకోని తనూజఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్ ఉపయోగించి సాయిని సేవ్ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సుమన్ కరెక్ట్ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్ అని పేర్కొన్నాడు.చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
రాము ఔట్.. ఇమ్మూ స్వార్థం! టాప్ 6 వీళ్లే..!
పచ్చని పల్లెటూరులో బతికే గంగవ్వకు ఏసీ వాతావరణం పడక, హౌస్‌లో ఉండలేక రెండుసార్లు (తెలుగు బిగ్‌బాస్ 4, 8వ సీజన్స్‌లో) సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. గత సీజన్లో మణికంఠ మానసికంగా వీక్ అయిపోయానంటూ పంపించేయమని వేడుకుని బయటకు వచ్చేశాడు. ఇప్పుడదే రకంగా రాము రాథోడ్ కూడా ఇంటి మీద బెంగతో తనంతట తానే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాగార్జున సర్దిచెప్పినా సరే వినకుండా ఎలిమినేషన్‌కే మొగ్గుచూపాడు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 8వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..టాప్ 6లో ఎవరంటే?నాగార్జున, అమల, రామ్‌గోపాల్ వర్మల 'శివ' మూవీ ప్రమోషన్స్‌తో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత.. కంటెస్టెంట్లు ఎవరు హిట్టు? ఎవరు ఫ్లాప్? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించారు. అందులో సుమన్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel), తనూజ, కల్యాణ్, రీతూ, పవన్ టాప్ 6లో ఉన్నారు. వీరికి నాగ్ కొన్ని బంపరాఫర్స్ ఇస్తూనే కొన్ని కండీషన్స్ పెట్టాడు. వారి కోరికలు నెరవేర్చుకోవాలంటే కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నాడు.ఇమ్మూ స్వార్థంభరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సుమన్ కెప్టెన్సీ కంటెండర్ అవుతాడని తెలిపాడు. దీన్ని సుమన్ తిరస్కరించి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఆడి గెల్చుకుంటానన్నాడు. ఇమ్మాన్యుయేల్‌కు గర్ల్‌ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ వచ్చిందని, అది వినాలంటే గౌరవ్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ పోతుందన్నాడు. ఆ పవర్ పోతే పోనీయ్.. అని భావించిన ఇమ్మూ.. ప్రియురాలి సందేశం విని ఎమోషనలయ్యాడు. తనూజ సోదరి వాయిస్ మెసేజ్ వినాలంటే కల్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవాలన్నాడు. రీతూకి రెండు సర్ప్రైజ్లురెండువారాల్లో సోదరి పెళ్లి ఉందని ఎమోషనలైన తనూజ.. తన కోసం కల్యాణ్‌ను బలి చేసేందుకు ఒప్పుకోలేదు. కల్యాణ్‌కు వారంపాటు చికెన్, మటన్ కావాలంటే నిఖిల్ రెండు వారాలు నామినేట్ అవ్వాలన్నాడు. దీన్ని కల్యాణ్ తిరస్కరించాడు. రీతూ.. తండ్రి షర్ట్ పొందడం కోసం సంజనా చీరల్ని కోల్పోయింది. పవన్.. ఫ్యామిలీ ఫోటో కావాలంటే రీతూకి తండ్రి ఫోటో రాదన్నాడు. దీంతో అతడు తన ఫ్యామిలీ ఫోటో త్యాగం చేసి రీతూకి ఆమె తండ్రి ఫోటో వచ్చేలా చేశాడు.రాను బిగ్‌బాస్‌కు రానంటూ..ఇంటిమీద బెంగ పెట్టుకున్న రాము (Ramu Rathod)ను నాగ్ కదిలించగానే.. అతడు పాట రూపంలో తన బాధనంతా బయటపెట్టాడు. బయటకు వెళ్లిపోతానన్నాడు. హీరోలు ఆట అంతు చూస్తారు, కానీ మధ్యలో వదిలేయరు అని నాగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా రాము వినిపించుకోలేదు. క్షమించండి సార్, వెళ్లిపోతాను అని పదేపదే అదే మాట అన్నాడు. వెళ్లిపోవాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తా.. 10 సెకన్లలో నిర్ణయం చెప్పమంటూ టైమిచ్చినా.. వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. హౌస్మేట్స్ ఆపేందుకు ప్రయత్నించినా లెక్కచేయలేదు. అలా రాము స్వతాహాగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇది సడన్ ఎలిమినేషన్ కావడంతో అతడి జర్నీ వీడియో చూడకుండానే వెళ్లిపోయాడు.చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే.. -
నన్ను బెదిరించేవాడే లేడన్న భరణి.. మళ్లీ అతడే కెప్టెన్!
రెండు రోజులుగా ఎపిసోడ్స్ చూస్తుంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) నిద్రమత్తులో ఉన్నట్లే కనిపిస్తోంది. ఏదో టాస్కులిచ్చామా? ఆడించామా? అన్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు.. అసలైన రెబల్‌ను వదిలేసి ఎక్కువమంది రెబల్ అనుకునేవ్యక్తిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడమైతే మరీ దారుణం. ఇక గురువారం (నవంబర్ 6వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..గొడవకు సైపాత రెబల్స్ దివ్య (Divya Nikhita)-సుమన్‌కు ఇచ్చిన పని పూర్తయిందన్నారు. తర్వాత రీతూను కొత్త రెబల్‌గా నియమించి ఒకరితో సీరియస్‌గా గొడవపడమన్నాడు. ఇంకేముంది.. ఇమ్మూతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకర్ని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దాని సాయంతో ఆమె సాయిని తీసేసింది. ఏ గేమ్ పెట్టినా గెలుపు మాత్రం ఆరెంజ్ టీమ్‌దే అన్నట్లుగా ఉంది పరిస్థితి. గౌరవ్‌కు బ్యాడ్జ్..మొన్న జరిగిన రెండు టాస్కుల్లో వీరే గెలిచారు. నిన్నటి టాస్కులో ఇమ్మూ, గౌరవ్ ఆడి మరోసారి టీమ్‌ను గెలిపించారు. ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ నాక్కావాలని గౌరవ్ అడిగితే మొదట్లో కుదరదని వాదించారు. కానీ, చివరకు సరేనని ఇచ్చారు. బంధాల వల్లే బయటకు వెళ్లిన భరణి లోపలకు వచ్చాక కూడా పెద్దగా మారలేదు. దీంతో నాగార్జున క్లాస్ పీకడంతో కాస్త బుద్ధి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాన్ని కాస్త ధైర్యంగా చెప్తున్నాడు. నన్ను బెదిరించేవాడే లేడురెబల్ ఎవరనుకుంటున్నారు? అన్న చర్చలో సంజనాయే అని అనుమానపడ్డాడు. తను మీకు చెప్పిందా? అని దివ్య అడగ్గా.. చెప్పకపోతే నెక్స్ట్ వెళ్లిపోయేది మీ టికెటే అని కల్యాణ్ రెచ్చగొట్టాడు. అందుకు భరణి.. నేను వెళ్లిపోయినా పర్లేదు, హౌస్‌లో నన్ను బెదిరించేవాడే లేడు. వాడు రెబల్ అయినా.. రెబల్‌కు బాబు అయినా! ఆల్రెడీ చచ్చి బతికొచ్చినోడ్ని.. అంటూ డైలాగ్ కొట్టాడు.సీక్రెట్ టాస్క్‌లో ఫెయిల్తర్వాత రీతూకు.. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటో కొట్టేయమని మరో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ రీతూ పూర్తి చేయలేదు. తర్వాత బిగ్‌బాస్ అందర్నీ కూర్చోబెట్టి ఎవరు రెబల్ అనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఎక్కువమంది గౌరవ్ పేరు చెప్పడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే బిగ్‌బాస్ రెబల్స్ దివ్య, సుమన్ శెట్టిని కంటెండర్లుగా ప్రకటించారు. కొత్త కెప్టెన్ ఎవరంటే?సంజన, నిఖిల్, గౌరవ్, డిమాన్, సాయి, కల్యాణ్ రేసులో నుంచి ఇదివరకే ఔట్ అయిపోగా తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూ మిగిలారు. వీరిలో నలుగురికే ఛాన్స్ అనడంతో రాము తాను తప్పుకుంటానని ముందుకొచ్చాడు. అలా కెప్టెన్సీ కోసం తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ, దివ్య, సుమన్ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మళ్లీ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
విడిపోనున్న తండ్రీకూతురు.. తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణి
మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్‌లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్బాస్ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్‌లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజ వర్సెస్ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్ జరగనున్నాయి.తనూజ వర్సెస్ ఇమ్మూతాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఏవైనా ఉంటే బయట చూసుకోండిభరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్ ఎక్కడుంది? ఏదైనా పాయింట్ మాట్లాడితే అది మీ పర్సనల్ అంటున్నారు. పర్సనల్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్‌లో కాదు అని అరిచేసింది.తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణిఏదైతే బాండింగ్ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది. చదవండి: నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు! -
ఏడ్చేసిన సుమన్.. నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో తొమ్మిదో వారం నామినేషన్స్‌కు రంగం సిద్ధమైంది. ఫైర్ బ్రాండ్ మాధురి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది మిగిలారు. వీరికి గతంలోని పాత బొమ్మల టాస్కే ఇచ్చారు. బజర్ మోగగానే వేరేవారి ఫోటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్ జోన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆఖరిగా జోన్లో అడుగుపెట్టేవారు, వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫోటో ఉంటుందో వారు నామినేషన్ జోన్లోకి వస్తారు.ఏడ్చేసిన సుమన్తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. సంజనా (Sanjana Galrani) మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్‌గానే ఉన్నాను. కానీ, రీతూ గేమ్‌లో డిమాన్ పవన్ సాయం చేస్తున్నాడు. అది అందరికీ కనిపిస్తుందని చెప్పింది. అది విన్న రీతూ.. మీకెలా బాండ్స్ ఉన్నాయో, నాకూ అలాగే హౌస్‌లో ఒక బాండ్ ఉంది. అది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను అని ఇచ్చిపడేసింది. సుమన్ మాట్లాడుతూ.. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, తనూజను సేవ్ చేసి నేను నామినేట్ అవాలనుకుంటున్నా అని ఏడ్చేశాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు. సుమన్ (Suman Shetty) కళ్లలో నీళ్లు తిరిగేసరికి పవన్, కల్యాణ్ అతడిని ఓదార్చారు.నామినేషన్స్‌లో ఎవరు?మొత్తానికి ఈ వారం భరణి, సంజనా, తనూజ, రాము, సాయి, కల్యాణ్ నామినేట్ అయ్యారని తెలుస్తోంది. తనూజ.. ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్ చేశారంటున్నారు. అది నిజమేనా? ఏమైనా మార్పులుచేర్పులున్నాయా చూడాలి! బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు. ఇది అతడికే మైనస్ అవుతుంది. నామినేషన్స్‌లోకి వస్తేనే అతడి అభిమానులకు ఓట్లేయడం అలవాటవుతుంది. తనకు ఏ స్థాయిలో ఓట్లు పడతాయి? దాన్ని పెంచేందుకు ఇంకా ఎలా కృషి చేయాలన్నది ఐడియా వస్తుంది? లేదంటే టాప్ 2కి బదులుగా టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి -
మాధురితో గుంజీలు తీయించిన మహానుభావుడు.. కల్యాణ్‌తో తనూజ లొల్లి
హౌస్‌లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూమాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.మరీ ఓవర్ చేస్తున్నారుఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్‌గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు -
దివ్య, ఇమ్మూ అసలైన తోపులు.. ఓవర్ చేసిన శ్రీజ.. మరోసారి బైబై!
హౌస్‌లో టెంపరరీ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. కానీ, బయట వస్తున్న సింపతీ, అభిమానం చూశాక గర్వం తలకెక్కింది. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (అక్టోబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అన్నం మీద అలిగిన మాధురితనూజ ఏ ముహూర్తాన రేషన్ మేనేజర్ అయిందో కానీ కిచెన్‌లో ఒకటే గొడవలు.. ఈ సారి ఆ గొడవల్లో మాధురి బలైంది. అన్నం మీద అలిగి కూర్చుంది. తను తినకుండా ఉంటే భరణి (Bharani Shankar) చూసి తట్టుకోలేకపోయాడు. అతడే కాదు, సంజనా, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్.. ఇలా అందరూ తినమని బతిమాలారు. అందరూ పదేపదే అడిగేసరికి కాదనలేక తినేసింది. అలక తగ్గిపోయాక తనూజతో కలిసిపోయి తనకు జడేసింది.తనూజకి పొగరు: శ్రీజమధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూర కాస్త మిగిలింది, కావాలనుకున్నవాళ్లు రండని పిలిచింది తనూజ (Thanuja Puttaswamy). దీంతో సాయి సహా మరికొందరు వెళ్లి కూర వేసుకున్నారు. కాసేపటికి శ్రీజ.. కర్రీ ఉందా? అని అడగ్గా తనూజ స్పందించలేదు. దాంతో శ్రీజ.. నేను టెంపరరీ హౌస్మేట్ని అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు.. ఆమె(తనూజ)కు పొగరని ఇందుకే అన్నానంటూ ఫైర్ అయింది. ఇక్కడ పవన్.. తనూజకోసం స్టాండ్ తీసుకోవడం గమనార్హం!కల్యాణ్‌ను చిత్తు చేసిన ఇమ్మూఇక బిగ్‌బాస్.. కట్టు-పడగొట్టు టాస్క్‌ను రద్దు చేసి మరో గేమ్ ఇచ్చాడు. భరణి పరిస్థితి బాలేనందున అతడి కోసం దివ్య ఆడింది. శ్రీజ ఈ గేమ్‌లో అట్టర్ ఫ్లాప్ అవగా దివ్య అలవోకగా ఆడి గెలిచేసింది. మరో గేమ్‌లో శ్రీజ కోసం కల్యాణ్, భరణి కోసం రాము బరిలో దిగారు. ఇందులో కల్యాణ్ చకచకా ఆడి గెలిచేశాడు. తర్వాతిచ్చిన టాస్క్‌లో మాత్రం కల్యాణ్ చిత్తుగా ఓడిపోయాడు. భరణి కోసం ఆడిన ఇమ్మూ మరోసారి తన పవర్ చూపించాడు. ఇలా భరణి రెండు టాస్కులు గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు.హర్టయిన పవన్అయితే శ్రీజ కోసం తాను ఆడతానన్నా తన పేరు లెక్కలోకి తీసుకోకపోవడంపై డిమాన్ పవన్ హర్టయ్యాడు. టాలెంట్, స్కిల్ ఉన్నా గుర్తించకపోతే బాధగా ఉంటుంది. ఈజీ గేమ్.. కల్యాణ్ ఆడలేకపోయాడు అని కామెంట్ చేశాడు. ఈ విషయంలో పవన్-శ్రీజకు గొడవ అయింది. తర్వాత కల్యాణ్.. గేమ్‌లో ఓడిపోయినందుకు శ్రీజకు సారీ చెప్పాడు. సారీ చెప్తే గూబ పగిలిపోద్ది.. అన్నీ మనమే గెలుస్తామా? అంటూ ఫ్రెండ్‌ను ఓదార్చింది. శ్రీజ రెండోసారి ఎలిమినేట్గతంలో నామినేషన్స్‌లో ఉన్నప్పుడు పవన్ సేవ్ చేయడం వల్లే శ్రీజ మరికొన్ని వారాలు హౌస్‌లో ఉంది. అతడే మొన్నటి టాస్క్‌లో దెబ్బలు తగిలించుకుని మరీ శ్రీజను గెలిపించాడు. అయినా పవన్‌ను పక్కనపెట్టడం ఏంటో ఆమెకే తెలియాలి! హౌస్‌లో ఆమె చేస్తున్న ఓవరాక్షన్ వల్ల ఓట్లు కూడా సరిగా పడలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అవగా భరణి హౌస్‌లో ఉండిపోయాడని తెలుస్తోంది.చదవండి: బుల్లితెర నటి చెల్లితో ఆర్జే సూర్య ఎంగేజ్మెంట్ -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. కెప్టెన్సీ గేమ్అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్‌ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది. అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్‌కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.రీఎంట్రీ?హౌస్‌మేట్స్‌తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్‌లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. చదవండి: సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్ -
సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీకి చాలా పవర్ ఉంది. అందర్నీ ఆజమాయిషీ చేయడం కన్నా ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందన్న క్రేజే ఎక్కువ. కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ ఎంచక్కా నామినేషన్స్ తప్పించుకుని కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చని హౌస్మేట్స్ భావిస్తుంటారు. అలాంటి కెప్టెన్సీని గతంలో ఇమ్మాన్యుయేల్ (Emmanuel) చేతులారా వదిలేసుకున్నాడు.సంజనా కోసం త్యాగంసంజనా (Sanjana Galrani)ను హౌస్మేట్స్ మిడ్వీక్లో ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే కదా! తను హౌస్‌లోకి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాలని నాగార్జున కండీషన్ పెట్టారు. తనూజ కాఫీ వదిలేయాలని, రీతూ జుట్టు కత్తిరించుకోవాలని, భరణి.. తనకిష్టమైన లాకెట్ స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ వదిలేయాలన్నారు. వీళ్లందరూ ఆ త్యాగాలు చేశారు కాబట్టే సంజనా హౌస్‌లో ఉంది.మళ్లీ సంపాదించిన ఇమ్మూఅలా ఇమ్మాన్యుయేల్ తన కెప్టెన్సీని కనీసం ఒకరోజైనా ఫీల్ అవలేకపోయాడు. అయితేనేం మళ్లీ ఆడి గెలిచే సత్తా తనకుంది. అది ఈ వారం మరోసారి రుజువు చేసుకున్నాడని తెలుస్తోంది. ఫోకస్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కెప్టెన్‌గా ఇమ్మూ రూలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం! చదవండి: బిగ్‌బాస్ దరిద్రపుగొట్టు ఐడియా.. నీళ్లు ఉమ్మే టాస్క్ ఏంటయ్యా! -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్‌మేట్స్‌ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్‌లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్‌బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్‌తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్‌ను కెప్టెన్స్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్‌లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్‌తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్‌తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్‌లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్‌పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్‌లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్‌బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్‌లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?సగం నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)ఈసారి బంతి గౌరవ్‌కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్‌గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్‌గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్‌లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్‌గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం) -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్‌లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్‌సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్‌బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్‌బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్‌ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
లత్కోర్ హరీశ్.. దారుణంగా అవమానించిన నాగ్! జుట్టు కత్తిరించుకున్న రీతూ
నామినేషన్స్‌లోనే లేని సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేసిన ఇంటిసభ్యులు.. ఏంటి? నిజమే? అంత సీన్ లేదు! అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్‌లోకి పంపించారు. సంజనాలోని వైల్డ్ఫైర్తో శనివారం ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గానే సాగింది. ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తనకోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది. బిడ్డా, బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్‌బాల్ ఆడాడని రాముపై మండిపడింది. త్యాగాలు చేస్తే హౌస్‌లోకి సంజనా..అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీశ్ ఒకే డ్రెస్సుతో నాలుగురోజులుగా వంటచేస్తున్నాడు, ఏం చెప్పినా వినడు, ఈ మనిషితో బతకడం కష్టం అని మాస్క్ మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది. ఇమ్మాన్యుయేల్‌ను కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది. తర్వాత సంజనాకు బై చెప్పిన నాగ్.. ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు. బిగ్‌బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు. కానీ, దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు. ముందుగా ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు. క్షణం ఆలోచించకుండా ఇమ్మూ తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు. జుట్టు కత్తిరించుకున్న రీతూతనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయేవరకు వెళ్లకూడదన్నాడు. అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది. రీతూ చౌదరిని టామ్‌బాయ్ హెయిర్‌కట్ చేయించుకోవాలన్నాడు. నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది, తనకోసం జుట్టు కత్తిరిచ్చుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది. దీంతో దివ్య నిఖిత.. రీతూ హెయిర్ కట్ చేసింది. జుట్టు కట్ చేస్తుంటే చిన్న పిల్లా ఏడ్చింది రీతూ. శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్‌తోనే సీజన్ అంతా ఉండాలి.. తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్. ఒప్పుకోని సుమన్, శ్రీజఅందుకు శ్రీజ ఒప్పుకోలేదు. పోనీ సుమన్.. సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు.. సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు. భరణి.. తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు. వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్రూమ్లో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్‌లో పెట్టి ఎమోషనలయ్యాడు. తనకోసం ఈ నలుగురూ ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్‌లో ఉండిపోయింది. ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపారు. ఆమె రావడమే గిట్టని హరీశ్.. డెవిల్ ఈజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు.లత్కోర్ పంచాయితీఇకపోతే నామినేషన్స్‌లో హరీశ్.. పవన్-రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయం గురించి ప్రస్తావిస్తూ లత్కోర్ పనులు అన్నాడు. దాని గురించి మాట్లాడేందుకు నాగ్.. లత్కోర్ హరీశ్ అని పిలిచాడు. నేను వ్యక్తిని అనలేదు, అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీశ్ వివరణ ఇచ్చాడు. అయినా నాగార్జున వినలేదు. లత్కోర్ పదం తప్పు.. నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు. ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్‌లో సంచాలక్‌గా తుత్తరపడ్డ శ్రీజకు.. మళ్లీ బిగ్‌బాస్ చెప్పేవరకు ఈరోజు వేసుకున్న డ్రెస్‌లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ద ట్రయల్ 2 సిరీస్ రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే! -
మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్‌రూమ్‌కు!
ఏమాటకామాట.. ఈ సీజన్‌కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్‌గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడుబిగ్బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్‌లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్బాస్ఇక బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్‌గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు. అందరి నిర్ణయం ఒక్కటేదీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను. సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూఅలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్‌గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.ఒంటరివాడ్ని అయిపోయా!నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్‌లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్‌లో ఉండొచ్చని బలంగా నమ్మారు.చదవండి: దీపికా పదుకొణెకు మరో బిగ్ సినిమా ఛాన్స్ -
సంజనా ఎలిమినేట్! వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఈవారం మొదట్లో హౌస్‌మేట్స్‌కు కొన్ని ఫలాలిచ్చాడు. అందులో రంగురంగుల విత్తనాలున్నాయి. నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్ప్రైజ్లు అందుకున్నారు. నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు. ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్‌బాస్.గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్హౌస్లో ఒకర్ని బయటకు పంపాలన్నాడు. ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనా (Sanjana Galrani)ను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీశ్. భరణి, రాము, డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ అందరూ కలిసి చర్చించుకున్నారు. మెజారిటీ సభ్యులు సంజనాకే ఓటేశారు. దీంతో సంజనాను వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్‌బాస్. ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ, ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది.నామినేషన్స్‌లోనే లేదుఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు. అప్పటివరకు సీక్రెట్‌రూమ్‌లో ఉంచుతారు. అయితే ఈ విషయం హౌస్‌మేట్స్‌కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్‌లోనే లేదు. అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఇదంతా స్టంట్ అని అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది. చదవండి: 8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్! -
వాళ్లను టాప్ 5లో పెట్టిన వైల్డ్‌కార్డ్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. అయితే దానికంటే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులను వారి ఆట,మాట ఆధారంగా వరుస ర్యాంకుల్లో నిల్చోబెట్టమన్నాడు. దాదాపు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అలాగే హౌస్‌మేట్స్‌కు ర్యాంకులిచ్చింది. రెండుమూడు మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నాయి.ర్యాంకింగ్..భరణిని టాప్ 1లో, ఇమ్మాన్యుయేల్‌ను రెండో స్థానంలో, సంజనాను మూడు, డిమాన్ పవన్‌ను నాలుగు, తనూజను ఐదో స్థానంలో నిలబెట్టింది. సుమన్, రీతూ, ప్రియ, హరీశ్, శ్రీజ, కల్యాణ్, రాము, ఫ్లోరాకు వరుసగా ఆరు నుంచి 13 స్థానాలిచ్చింది. దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 5లో ఉన్నవారు మాత్రేమ కెప్టెన్సీకి పోటీ పడతారని ప్రకటించాడు బిగ్‌బాస్.కెప్టెన్సీ టాస్క్వీరితోపాటు దివ్యను కూడా కంటెండర్‌గా అనౌన్స్ చేశాడు. వీళ్లకు తప్పిస్తారా? గెలిపిస్తారా? అన్న గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో భరణి, ఇమ్మాన్యుయేల్ చివరి వరకు పోరాడారు. హౌస్మేట్స్ సహకారంతో ఇమ్మాన్యుయేల్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్సీకి పోరాడి ఓడియాడు. మూడోసారి మాత్రం గెలిచి దక్కించుకున్నాడు. మరి ఇమ్మాన్యుయేల్‌ను కెప్టెన్‌గా ప్రకటించేశారా? లేదంటే బిగ్‌బాస్ మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇచ్చాడా? అన్నది ఎపిసోడ్లో చూడాలి! చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
‘భూతం ప్రేతం’ పెద్ద హిట్ కావాలి: అనిల్ రావిపూడి
‘జబర్దస్త్’ ఫేమ్ యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి. వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూ΄÷ందిన చిత్రం ‘భూతం ప్రేతం’. ఐదుగురు కుర్రాళ్లు అనుకోకుండా భూతానికి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఆ భూతం నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది కథ. మా చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది... భయపెడుతుంది. ఈ ఏడాదిలోనే మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిరీష్ హోతుర్, కెమెరా: యోగేష్ గౌడ.


