బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో తొమ్మిదో వారం నామినేషన్స్‌కు రంగం సిద్ధమైంది. ఫైర్ బ్రాండ్ మాధురి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది మిగిలారు. వీరికి గతంలోని పాత బొమ్మల టాస్కే ఇచ్చారు. బజర్ మోగగానే వేరేవారి ఫోటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్ జోన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆఖరిగా జోన్‌లో అడుగుపెట్టేవారు, వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫోటో ఉంటుందో వారు నామినేషన్ జోన్‌లోకి వస్తారు.

ఏడ్చేసిన సుమన్
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. సంజనా (Sanjana Galrani) మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్‌గానే ఉన్నాను. కానీ, రీతూ గేమ్‌లో డిమాన్ పవన్ సాయం చేస్తున్నాడు. అది అందరికీ కనిపిస్తుందని చెప్పింది. అది విన్న రీతూ.. మీకెలా బాండ్స్ ఉన్నాయో, నాకూ అలాగే హౌస్‌లో ఒక బాండ్ ఉంది. అది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను అని ఇచ్చిపడేసింది. సుమన్ మాట్లాడుతూ.. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, తనూజను సేవ్ చేసి నేను నామినేట్ అవాలనుకుంటున్నా అని ఏడ్చేశాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు. సుమన్ (Suman Shetty) కళ్లలో నీళ్లు తిరిగేసరికి పవన్, కల్యాణ్ అతడిని ఓదార్చారు.
నామినేషన్స్‌లో ఎవరు?
మొత్తానికి ఈ వారం భరణి, సంజనా, తనూజ, రాము, సాయి, కల్యాణ్ నామినేట్ అయ్యారని తెలుస్తోంది. తనూజ.. ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్ చేశారంటున్నారు. అది నిజమేనా? ఏమైనా మార్పులుచేర్పులున్నాయా చూడాలి! బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు. ఇది అతడికే మైనస్ అవుతుంది. నామినేషన్స్‌లోకి వస్తేనే అతడి అభిమానులకు ఓట్లేయడం అలవాటవుతుంది. తనకు ఏ స్థాయిలో ఓట్లు పడతాయి? దాన్ని పెంచేందుకు ఇంకా ఎలా కృషి చేయాలన్నది ఐడియా వస్తుంది? లేదంటే టాప్ 2కి బదులుగా టాప్ 5తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
చదవండి: తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి


