బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్‌తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్‌ల బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించారు. అయితే, శుక్రవారం ఎపిసోడ్స్‌లో కల్యాణ్ పడాల, సంజనల జర్నీ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడిలా కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే పాయింట్‌తో బిగ్‌బాస్ ఎలివేషన్ ఇచ్చారు. ఆటలో తనకు ఎదురైన కష్టాలను మరోసారి గుర్తుచేశాడు. గెలవాలనే కసితో ఒక్కోవారం పోరాడుతూ కెప్టెన్‌గా రెండుసార్లు నిలిచాడు.. ఆపై ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. తన బుద్ధి బలానికి కండ బలం తోడు కావడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గెలుపు వైపు అడుగులు వేశాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో బిగ్‌బాస్ షోతో కల్యాణ్ ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడంటూ.. బిగ్‌బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు.


