‘అవతార్‌ 3’ ట్విటర్‌ రివ్యూ: సినిమాకు అదే పెద్ద మైనస్‌! | Avatar 3 Fire And Ash Movie Twitter Review And Public Talk In Telugu, Check These Tweets Before Watching This Film | Sakshi
Sakshi News home page

Avatar 3 X Review: ‘అవతార్‌ 3’ ట్విటర్‌ రివ్యూ: మైనస్‌ పాయింట్స్‌ ఇవే!

Dec 19 2025 10:30 AM | Updated on Dec 19 2025 11:14 AM

Avatar : Fire And Ash Twitter Review And Public Talk

హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్షన్‌లో రూపొందిన ‘అవతార్‌’ ఫ్రాంచైజీ మూడో చిత్రం ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు సూపర్‌ హిట్‌ కావడంతో అవతార్‌ 3(Avatar : Fire And Ash )పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ చిత్రం కోసం చాలా మంది ఎదురుచూశారు. 

ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మొదటి రెండు భాగాలు సృష్టించిన సంచలనాన్ని ఈ సీక్వెల్‌ కొనసాగిస్తుందా? లేదా? అనే చర్చ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.చిత్రం రిలీజ్‌ అయిన కొద్ది గంటల్లోనే నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌, పండోరా ప్రపంచ విస్తరణ, యాక్షన్‌ సీక్వెన్స్‌లు అద్భుతమని చాలా మంది పొగడ్తలు కురిపిస్తున్నారు. విజువల్స్‌ అదిరిపోయాయని అంటున్నారు. 

అయితే కథాంశం పరంగా మాత్రం మిశ్రమ స్పందనలే వినిపిస్తున్నాయి. అవతార్‌, అవతార్‌ 2 సినిమాల కథే ఇందులో మళ్లీ చూపించారని కొంతమంది నెటిజన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిడివి విషయంలోనూ చాలా మంది పెదవి విరుస్తున్నారు.ఎమోషనల్‌గా బాగుంది కానీ రన్‌టైమ్‌ చాలా ఎక్కువ (3 గంటల 15 నిమిషాలు) అని మరికొందరు అభిప్రాయపడ్డారు. విజువల్స్‌, యాక్షన్‌ పరంగా బాగున్నా.. కథ ఒకేలా ఉండడం పార్ట్‌ 3కి అతిపెద్ద మైనస్‌ అని చాలా మంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

 మీరు రెండో భాగం చూశారా? మూడో భాగం చూడాల్సిన అవసరం లేదు. అదే స్టోరీ. కేవలం కొన్ని కొత్త తెగలను, కొత్త విజువల్స్‌ను పరిచయం చేశారు అంతే. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, పార్ట్‌ 2, పార్ట్‌ 3 క్లైమాక్స్ దాదాపు ఒకేలా ఉంది. అయితే, విజువల్స్ కోసం ఒక్కసారి తప్పకుండా చూడవచ్చు’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement