హాట్‌స్పాట్‌ మూవీకి సీక్వెల్‌.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Priya Bhavani Shankar Hotspot 2 Much Movie First Look Poster Release Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

హాట్‌స్పాట్‌ మూవీకి సీక్వెల్‌.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

Dec 19 2025 8:54 AM | Updated on Dec 19 2025 11:01 AM

Hotspot 2 Much Movie First Look Poster Release

విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ సంస్థ సమర్పణలో కే.జే.బి టాకీస్‌ పతాకంపై నటుడు, నిర్మాత కేజే.బాలమణిమార్బన్‌ నిర్మిస్తున్న చిత్రం హాట్‌ స్పాట్‌ టూమచ్‌. ఇంతకుముందు వచ్చిన హాట్‌ స్పాట్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌ కావడం గమనార్హం. హీరోయిన్‌ ప్రియాభవానీ శంకర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇందులో నటుడు ఎమ్మెస్‌ భాస్కర్‌, తంబి రామయ్య, అశ్విన్‌ కుమార్‌, ఆదిత్య భాస్కర్‌, రాక్షసన్‌, భవాని శ్రీ, బ్రిగిడా సగా, రంజన తివారి, ఆదిత్య ఖదీర్‌, విజయ్‌ టీవీ అమర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

జగదీష్‌ రవి, జోసెఫ్‌ పాల్‌ ద్వయం ఛాయాగ్రహణం, సతీష్‌ రఘునాథన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి నటుడు విగ్నేష్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను గురువారం విడుదల చేశారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రూపొందించిన హాట్‌ స్పాట్‌ చిత్రం నాలుగు కథలతో ఆంథాలజీగా ఉందని, హాట్‌ స్పాట్‌ టూమచ్‌ చిత్రం మూడు వేర్వేరు కథలతో సాగుతుందని చెప్పారు. ఇది అన్ని వర్గాలకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. చిత్ర ఆడియో, టీజర్‌, ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement